Ram Pothineni : పవర్‌ఫుల్‌ రోల్‌‌లో రామ్‌.. టైటిల్ అదిరిందిగా..!

Ram Pothineni :  పవర్‌ఫుల్‌ రోల్‌‌లో  రామ్‌.. టైటిల్ అదిరిందిగా..!
Ram Pothineni : టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని తన కొత్త సినిమా అప్డేట్ ని వెల్లడించాడు.

Ram Pothineni : టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని తన కొత్త సినిమా అప్డేట్ ని వెల్లడించాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ్, తెలుగు బాషల్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు మేకర్స్.. ఈ సినిమాలో అది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్‌ చేశారు మేకర్స్‌.. ది వారియర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అంతేకాకుండా సినిమా నుంచి ఓ పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేశారు.. ఈ పోస్టర్ లో రామ్ పోలీస్ గా కనిపించనున్నాడు. ఇంతవరకు రామ్ పొలీస్ రోల్ లో కనిపించింది లేదు.. ఫస్ట్ రామ్ ఈ రోల్ లో కనిపిస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story