సినిమా

The Warriorr Teaser : వీలైతే మారిపోండి.. లేకపోతే పారిపోండి : ది వారియర్‌ టీజర్‌

The Warriorr Teaser : టాలీవుడ్ హీరో రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబోలో ది వారియర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

The Warriorr Teaser :  వీలైతే మారిపోండి.. లేకపోతే పారిపోండి :  ది వారియర్‌ టీజర్‌
X

The Warriorr Teaser : టాలీవుడ్ హీరో రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబోలో ది వారియర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.. ఇందులో రామ్ పొలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, అతని సరసన హీరోయిన్ గా కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్.

సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రామ్‌ ఇంతకుముందెన్నడూ చేయని ఫుల్‌ మాస్‌ పోలీస్‌పాత్రలో కనిపించనున్నాడు. విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. 'మైడియర్‌ గ్యాంగ్‌స్టర్స్‌ వీలైతే మారిపోండి.. లేకపోతే పారిపోండి.. ఇదే మీకు నేను ఇస్తున్న ఫైనల్‌ వార్నింగ్‌' అంటూ రామ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షర గౌడ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. జూలై 14న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో ఓ సినిమాని చేస్తున్నాడు రామ్.


Next Story

RELATED STORIES