Rashmi Gautham : జబర్దస్త్ బ్యూటీకి 'మెగా' ఆఫర్..!

Rashmi Gautham : జబర్దస్త్ బ్యూటీకి మెగా ఆఫర్..!
Rashmi Gautam : కెరీర్‌ మొదట్లో వెండితెరపై చిన్న పాత్రలతో చేసి ప్రేక్షకులను మెప్పించింది యాంకర్ రష్మీ గౌతమ్.. ఆ తర్వాత జబర్దస్త్ షోతో ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయిపొయింది.

Rashmi Gautam : కెరీర్‌ మొదట్లో వెండితెరపై చిన్న పాత్రలతో చేసి ప్రేక్షకులను మెప్పించింది యాంకర్ రష్మీ గౌతమ్.. ఆ తర్వాత జబర్దస్త్ షోతో ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయిపొయింది. ఇప్పడున్న టాప్ యాంకర్లలో ఆమె కూడా ఒకరు.. ఒకపక్కా జబర్దస్త్, ఢీ లాంటి షోలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటునే అప్పుడప్పుడు వెండితెర పైన కూడా మెరుస్తోంది. తాజాగా ఈ జబర్దస్త్ బ్యూటీకి ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్లుగా సమాచారం.

చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో భోళా శంకర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌‌‌గా నటిస్తోంది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్‌‌‌ని ప్రముఖ కోరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయనున్నారట. దీనికోసం మేకర్స్ రష్మీని సంప్రదించారట. ఆమెకూడా దీనికి ఓకే చెప్పినట్టు సమాచారం.

కాగా దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక అటు చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతుంది. ఈ షూటింగ్ పూర్తిచేసుకుని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story