Rashmika Mandana : రష్మికపై నెటిజన్ల ట్రోలింగ్.. "నువ్వేమైనా జెన్నిఫర్ లోపెజ్ అనుకుంటున్నావా"..

Rashmika Mandana : రష్మికపై నెటిజన్ల ట్రోలింగ్.. నువ్వేమైనా జెన్నిఫర్ లోపెజ్ అనుకుంటున్నావా..
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందనపై నెటిజన్లు మరోసారి ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు

Rashmika Mandana : నేషనల్ క్రష్ రష్మిక మందనపై నెటిజన్లు మరోసారి ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. తాజాగా రష్మిక మినీ సైజులో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది. రష్మికకు ఆ డ్రస్ సూటుకాలేదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్‌కు ఇన్స్‌టాగ్రామ్‌లో ఇప్పటికే 20 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అయినప్పటికీ ఇప్పుడు కొన్ని కామెంట్స్ పై చర్చ జరుగుతుంది.

రష్మికకు ఈ డ్రెస్ అన్‌కమ్ఫర్టబుల్‌గా ఉంది అయినా ఎందుకు వేసుకుంది అని ఒక కామెంటర్ అన్నాడు. నాకు రష్మిక అంటే ఇష్టం కానీ ఈ డ్రెస్ రష్మికకు బాగాలేదని మరో కామెంట్‌లో పోస్ట్ చేసాడు ఓ అభిమాని. ఇండియన్ స్టయిల్ డ్రెస్ వేసుకుంటే సరిగ్గా సరిపోతుంది. ఇలాంటి డ్రెస్‌లు మీకు అబ్బవు. మీరేమైనా జెన్నిఫర్ లోపెజ్, గిజి హదిద్ లాంటి హాలీవుడ్ తారలనుకుంటున్నారా.. అని మరో అభిమాని కామెంట్ పోస్ట్ చేశాడు.


Tags

Read MoreRead Less
Next Story