సినిమా

Rashmika Mandanna: పుష్ప హిట్‌తో రెమ్యునరేషన్ విషయంలో మాట మార్చేసిన రష్మిక..

Rashmika Mandanna: ఈ సినిమాలో శ్రీవల్లిగా నటించిన రష్మిక రెమ్యునరేషన్ గురించి ఓ రూమర్ వైరల్ అవుతోంది.

Rashmika Mandanna (tv5news.in)
X

Rashmika Mandanna (tv5news.in)

Rashmika Mandanna: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప'.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. 2021 చివర్లో విడుదలయినా కూడా ఆ సంవత్సరంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప రికార్డ్ సాధించింది. ఇప్పటికీ పుష్ప మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో శ్రీవల్లిగా నటించిన రష్మిక రెమ్యునరేషన్ గురించి ఓ రూమర్ వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ సరసర తొలిసారి హీరోయిన్‌గా నటించింది రష్మిక. ఇటు సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తానేంటో నిరూపించుకోవడానికి రష్మిక సిద్ధమవుతోంది. పుష్ప సినిమాలో డీ గ్లామర్ పాత్రలో కనిపించిన రష్మిక.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. శ్రీవల్లిగా చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడడానికి చాలానే కష్టపడింది. అందుకే తన రెమ్యునరేషన్ విషయంలో మాట మార్చిందట రష్మిక.

పుష్ప కథ చాలా పెద్దది అని, దానిని ఒకే పార్ట్‌లో చెప్పడం కష్టమని ఫిక్స్ అయిన సుకుమార్.. రెండు పార్ట్‌లుగా దానిని విభజించాడు. పుష్పకు వచ్చిన రెస్పాన్స్‌తో మూవీ టీమ్ అంతా అప్పుడే పుష్ప 2 కోసం ప్లాన్స్‌ను మొదలుపెట్టేశారు. అయితే పుష్ప కోసం రష్మిక ఒప్పుకున్న రెమ్యునరేషన్ రూ.2 కోట్లేనట. కానీ పుష్ప పార్ట్ 2 కోసం మాత్రం తాను రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఎంతైనా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను కరెక్ట్‌గా ఫాలో అవుతోంది రష్మిక.

Next Story

RELATED STORIES