సినిమా

Rashmika Mandanna: 'నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారు'.. నెటిజన్‌‌ ప్రశ్నకు రష్మిక కౌంటర్‌..!

Rashmika Mandanna : ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్స్‌‌ని ట్రోల్‌ చేయడం మనము చూస్తూనే ఉంటాం.. కొందరు హీరోయిన్లు వీటిని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు..

Rashmika Mandanna: నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారు.. నెటిజన్‌‌ ప్రశ్నకు రష్మిక కౌంటర్‌..!
X

Rashmika Mandanna : ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్స్‌‌ని ట్రోల్‌ చేయడం మనము చూస్తూనే ఉంటాం.. కొందరు హీరోయిన్లు వీటిని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు.. హద్దు మీరితే మాత్రం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంటారు. తాజాగా రష్మిక మందాన్నాకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నిన్న(శుక్రవారం) దసరా సందర్భంగా ఆమె నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.


ఇందులో రష్మిక నవ్వుతూ, శర్వానంద్ సిగ్గుపడుతూ కనిపించారు. అయితే ఈ పోస్టర్‌ పైన ఓ నెటిజన్‌ రష్మికను ట్రోల్‌ చేస్తూ.. 'దీన్ని సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారు' అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపైన రష్మిక స్పందిస్తూ... 'నా నటన కొసం' అంటూ అతడికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. రష్మిక స్పందించిన తీరుపట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు పలువురు నెటిజన్లు.ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో పాటుగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కూడా రష్మిక నటిస్తోంది.

Next Story

RELATED STORIES