సినిమా

Ravi Teja : క్రాక్ హిట్టు.. రేటు పెంచిన మాస్ మహారాజా...!

Raviteja : వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత క్రాక్ సినిమాతో మళ్ళీ హిట్ బాట పట్టాడు మాస్ మహారాజా రవితేజ.. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.

Ravi Teja : క్రాక్ హిట్టు.. రేటు పెంచిన మాస్ మహారాజా...!
X

Raviteja : వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత క్రాక్ సినిమాతో మళ్ళీ హిట్ బాట పట్టాడు మాస్ మహారాజా రవితేజ.. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పుడు రవితేజ చేతిలో అయిదు సినిమాలున్నాయి. ఇందులో ఖిలాడి, రామరావు ఆన్ డ్యూటీ, ధమఖా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలున్నాయి. ఈ సినిమాలన్నీ డిఫిరెంట్ కథాశంలతో తెరకెక్కుతున్నాయి. మరికొన్ని కథలు వవింటున్నారు రవితేజ.. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఒక్కో సినిమాకి రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా సమాచారం కాగా ఇప్పుడు రూ. 16 కోట్లు ఆయన డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రవితేజ కూడా మంచి సక్సెస్ లో ఉండడం, కథలు కూడా బాగుండడంతో నిర్మాతలు కూడా ఇచ్చేందుకు వెనుకాడడం లేదని సమాచారం. అయితే దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Next Story

RELATED STORIES