Raviteja : నా కెరీర్‌లో రాడ్ సినిమా అంటే అదే : రవితేజ

Raviteja : నా కెరీర్‌లో రాడ్ సినిమా అంటే అదే : రవితేజ
Raviteja : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్‌స్టాపబుల్ షోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ షోలో పలువురు సెలబ్రిటీ పాల్గొని సందడి చేస్తున్నారు.

Raviteja : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్‌స్టాపబుల్ షోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ షోలో పలువురు సెలబ్రిటీ పాల్గొని సందడి చేస్తున్నారు. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ షోలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తన కెరీర్ లో రాడ్ రాంబోలా సినిమా అంటే అమర్ అక్బర్ ఆంటోనీ అంటూ చెప్పుకొచ్చాడు. టాక్ షో మధ్యలో కొన్ని ఫోటోలు చూపించిన బాలకృష్ణ వాటి సంబంధించి అడిగాడు. అందులో అమర్ అక్బర్ ఆంటోనీ ఫోటో కూడా ఉంది. దీనిపైన రవితేజ మాట్లాడుతూ తన కెరీర్‌లో అత్యంత రాడ్ రాంబోలా సినిమా అని ఇది రాడ్డులకే రాడ్డు ఇది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా రవితేజ హీరోగా శ్రీనువైట్ల కాంబినేషన్ లో మొత్తం నీకోసం, వెంకీ, దుబాయ్ శీను, అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాలు వచ్చాయి. నీకోసం చిత్రంతో శ్రీనువైట్ల దర్శకుడిగా మారారు.

Tags

Read MoreRead Less
Next Story