జంధ్యాల మీద అసూయతోనే ఆ సినిమా చేశాను.. కానీ ఆయనే గ్రేట్..!

జంధ్యాల మీద అసూయతోనే ఆ సినిమా చేశాను.. కానీ ఆయనే గ్రేట్..!
దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా తెలుగు చిత్రకి పరిశ్రమకి పరిచయమై హాస్య,కుటుంబ చిత్ర దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు రేలంగి నరసింహారావు.

దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా తెలుగు చిత్రకి పరిశ్రమకి పరిచయమై హాస్య,కుటుంబ చిత్ర దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు. చేసిన డెబ్బై సినిమాలలో 90 శాతం హిట్లు ఆయన ఖాతాలో ఉండడం విశేషం. అయితే అదే సమయంలో రేలంగి నరసింహారావుతో పాటుగా కామెడీ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జంధ్యాల.

నటకిరీటి రాజేంద్రప్రసాద్ తో జంధ్యాల తెరకెక్కించిన అహనా పెళ్ళంట ఎంతటి ఘనవిజయాన్నీ అందుకుందో అందరికీ తెలిసిందే. పిసినారితనం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ అందర్నీ నవ్విస్తుంది. అయితే ఈ సినిమాలోని పిసినారితనం అనే కాన్సెప్ట్ ని కాపీ కొట్టి ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అనే సినిమాని తెరకెక్కించినట్టుగా రేలంగి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ సినిమాకి అహనా పెళ్ళంట ప్రేరణ అని రేలంగి చెప్పుకొచ్చారు. జంధ్యాల చేసింది నేను ఎందుకు చేయలేనని అసూయతోనే ఆ సినిమాని తీశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇద్దరం సమకాలీన దర్శకులమే అయినప్పటికీ తన కంటే జంధ్యాల అన్నీ విషయాల్లో ఓ అడుగు ముందేఉండేవారని చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story