సినిమా

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' మళ్లీ పోస్ట్ పోన్..?

Sarkaru Vaari Paata: ప్రస్తుతం టాలీవుడ్‌లోని బడా హీరోల ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Sarkaru Vaari Paata (tv5news.in)
X

Sarkaru Vaari Paata (tv5news.in)

Sarkaru Vaari Paata: ప్రస్తుతం టాలీవుడ్‌లోని బడా హీరోల ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దాదాపు హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ.. ఫుల్ ఫార్మ్‌ను చూపిస్తున్నారు. కానీ మహేశ్ ఫ్యాన్స్ మాత్రం అప్డేట్స్ విషయంలో కాస్త డిసప్పాయింట్‌మెంట్‌లోనే ఉన్నారు. తన సినిమా గురించి తాజాగా మరో నిరాశపరిచే రూమర్ బయటికొచ్చింది.

మహేశ్ బాబు అప్‌కమింగ్ చిత్రం 'సర్కారు వారి పాట' గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ మూవీ యూనిట్ మాత్రం ఈ షూటింగ్‌ను మరింత ఆలస్యం చేస్తూ వస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా నుండి పలు పోస్టర్స్‌తో సహా టీజర్ కూడా విడుదలయ్యింది. మళ్లీ ఆ తర్వాత సర్కారు వారి పాట నుండి ఏ అప్డేట్ లేదు.

ముందుగా సర్కారు వారి పాటను సంక్రాంతి రేసులో నిలబెట్టాలనుకుంది మూవీ టీమ్. కానీ అప్పటికీ షూటింగ్ పూర్తవ్వదు అన్న సందేహంలో ఉన్న మూవీ యూనిట్.. ఆ రేస్ నుండి తప్పుకుంది. చివరిగా సమ్మర్‌కు సర్కారు వారి పాట వస్తుందని మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. సమ్మర్‌కు ఇంకా చాలా టైమ్ ఉన్నా కూడా సర్కారు వారి పాట అప్పటికీ విడుదల కావడం కష్టమే అని టాక్ వినిపిస్తోంది.

పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుండి అప్పుడప్పుడు కొన్ని వర్కింగ్ స్టిల్స్ బయటికి వచ్చాయి. గత కొన్నిరోజులుగా ఆ స్టిల్స్ కూడా రావడం ఆగిపోయాయి. అందుకే సినిమా షూటింగ్ ఆగిపోయిందేమో, సమ్మర్‌కు రిలీజ్ అవ్వడం కష్టమేమో అనుకుంటున్నారు ఫ్యాన్స్. సర్కారు వారి పాట మూవీ టీమ్ మాత్రమే ఈ సందేహానికి సమాధానం ఇవ్వగలదు.

Next Story

RELATED STORIES