సినిమా

Renu Desai: రేణు దేశాయ్, అకీరాకు కరోనా పాజిటివ్..

Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు, కొడుకు అకీరాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది.

Renu Desai: రేణు దేశాయ్, అకీరాకు కరోనా పాజిటివ్..
X

Renu Desai: ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో చాలామంది సెలబ్రిటీలు హోం క్వారంటీన్‌లో ఉంటున్నారు. మరికొందరు చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీనంతటికి వేగంగా వ్యాపిస్తున్న కరోనానే కారణం. అందులోనూ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన తర్వాత కరోనా వ్యాప్తి మరింత వేగం పెంచుకుంది. తాజాగా పవన్ మాజీ భార్య, కొడుకు కూడా కరోనా బారిన పడినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు, కొడుకు అకీరాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. 'న్యూ ఇయర్‌కు మాత్రమే కాకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉన్నా కూడా అకీరాకు, నాకు కొన్నిరోజుల క్రితం పాజిటివ్ వచ్చింది. మేము ఇప్పుడు కోలుకుంటున్నాం. అందరూ దయచేసి థర్డ్ వేవ్‌ను సీరియస్‌గా తీసుకోండి. మాస్కులు ధరించి, జాగ్రత్తగా ఉండండి. నేను గతేడాదే వ్యాక్సిన్ తీసుకున్నాను. అకీరాకు వ్యాక్సి్న్ ఇద్దామనుకునేలోపు కరోనా వచ్చింది' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రేణు దేశాయ్.


Next Story

RELATED STORIES