జీవితమంటేనే ఓ ప్రయోగం.. అర్థరాత్రి 'రేణూ దేశాయ్'..

జీవితమంటేనే ఓ ప్రయోగం.. అర్థరాత్రి రేణూ దేశాయ్..
పిల్లలిద్దరితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. విఐపీ కేటగిరి అయినా సాధారణ భక్తురాలిలా స్వామిని దర్శించుకున్నారు రేణు.

ఇద్దరు బిడ్డల తల్లిగా స్వంత వ్యక్తిత్వంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు నటి రేణూదేశాయ్. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్య్తక్తిగా వివిధ అంశాలపై స్పందిస్తుంటారు. సమాజానికి ఏదో చేయాలని తపన పడుతుంటారు. సెలబ్రెటీలా కాకుండా సాధారణ వ్యక్తిలా జనంతో మమేకమవుతుంటారు.

పిల్లలిద్దరితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. విఐపీ కేటగిరి అయినా సాధారణ భక్తురాలిలా స్వామిని దర్శించుకున్నారు రేణు. మొన్నామధ్య రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రశ్న లేవనెత్తారు. హిందూ దేవాలయాలు మాత్రం ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి.

మసీదులు, చర్చీలు మాత్రం ప్రవేట్ వ్యక్తుల ఆధ్యర్యంలో నడుస్తున్నాయి. మరి ఇదెలా సెక్యులర్ కంట్రీ అవుతుంది. అలా అని నేను మసీదులు, చర్చీలను ప్రభుత్వపరం చేయమని అనడంలేదు. కానీ దేవాలయాపై మాత్రం ప్రభుత్వ ఆధిపత్యం ఎందుకు అని రేణూ దేశాయ్ అన్నారు.

తాజాగా రేణూ దేశాయ్ ఓ పోస్ట్ పెట్టారు. తానిప్పుడు ఓ యాడ్ షూట్ కోసం రెడీ అవుతున్నానని చెబుతూ ఇది నా కంఫర్ట్ జోన్ కాదు. కానీ జీవితమంటేనే ఓ ప్రయోగం కదా.. నైట్ షూటింగ్ అంటే నైట్ మొత్తం ఉండాల్సిందే. అర్థరాత్రి 2 గంటలు అవుతోంది అని చెప్పుకొచ్చారు. కానీ తన వర్క్‌ని ఎంజాయ్ చేస్తున్నానని నవ్వుతూ సెల్ఫీలు దిగిన ఫోటోలు పోస్ట్ చేశారు.

రేణూదేశాయ్ ప్రస్తుతం ఆద్య అనే పాన్ ఇండియన్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. కార్పోరేట్ రంగంలోని మోసాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ సీఈవోగా తన పాత్రను మలిచారు. ఈ ప్రాజెక్టులో నందినీ రాయ్, ధన్సికలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story