సినిమా

Kondaa Trailer : విప్లవ పోరాటాలు చరిత్రను లాగే రైలు ఇంజన్లు.. 'కొండా' ట్రైలర్ రిలీజ్

Kondaa Trailer : తెలంగాణ పొలిటికల్ లీడర్స్ కొండా మురళి, సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న మూవీ 'కొండా'.

Kondaa Trailer : విప్లవ పోరాటాలు చరిత్రను లాగే రైలు ఇంజన్లు.. కొండా ట్రైలర్ రిలీజ్
X

Kondaa Trailer : తెలంగాణ పొలిటికల్ లీడర్స్ కొండా మురళి, సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న మూవీ 'కొండా'.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌‌ని రిలీజ్ చేశారు. ఆర్జీవీ వాయిస్‌‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

"సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు.. బాగు చేయాలే.. నీకు పోయేదందుకు ఏం లేవు.. బానిస సంకెళ్ళు తప్ప.. విప్లవ పోరాటాలు చరిత్రను లాగే రైలు ఇంజన్లు.. పెత్తందార్లు పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి.. వీపరిత పరిస్థుతుల నుంచే వీపరిత వ్యక్తులు ఉద్భవిస్తారని క్లార్ మార్క్స్ 180 సంవత్సరాల క్రితమే చెప్పాడు.. అలాంటి వీపరిత పరిస్థుతుల మధ్యలో పుట్టినవాడే కొండా మురళి" .. అంటూ ఆర్జీవీ ఇచ్చిన వాయిస్ ట్రైలర్ కి మెయిన్ హైలెట్ గా నిలిచింది.

కాగా ఈ సినిమాలో కొండా మురళిగా నటుడు త్రిగన్, సురేఖగా ఇర్రా మోర్ నటించారు. ఇటీవలే చివరి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.Next Story

RELATED STORIES