RGV: ఒకే ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆర్‌జీవీ.. అది కూడా వారం రోజులే..!

Ram Gopal Varma (tv5news.in)

Ram Gopal Varma (tv5news.in)

RGV: ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఛాన్స్ రావాలంటే దాదాపు కొన్ని సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండాలి.

RGV : ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఛాన్స్ రావాలంటే దాదాపు కొన్ని సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ గా నేర్చుకున్న మెలుకువలు దర్శకుడిగా మారిన తర్వాత చాలా ఉపయోగపడతాయి. ఇండస్ట్రీలో దర్శకులైన వారందరూ ఎవరో ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన వారే.. కానీ అందుకు రామ్ గోపాల్ వర్మ మాత్రం విరుద్ధం.

ఇండస్ట్రీకి అసిస్టెంట్స్‌గా వచ్చే చాలామంది రామ్ గోపాల్ వర్మ దగ్గర ఒక్కసారి పనిచేస్తే చాలు అనుకుంటారు. ఆయన ముక్కుసూటి గుణం, భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే అలవాటు.. ఇవన్నీ ఇష్టపడని వారు ఎంతమంది ఉంటారో ఇష్టపడే వారు అంతకు డబుల్ ఉంటారు. అందుకే ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేయాలన్నది చాలామందికి కల. అలాంటి వర్మ కూడా ఒక ప్రముఖ దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు.

రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి రాకముందు అమీర్పేటలో ఓ సినిమా క్యాసెట్స్ షాప్ నడిపేవారు. అలా అక్కడికి సినిమా వాళ్ళు వస్తుండడంతో వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. సినిమాలకు గురించి స్టడీ చేయడం అప్పుడే మొదలుపెట్టారు వర్మ. ఇండస్ట్రీలో ఏదైనా కొత్తగా చేయాలన్న ఉద్దేశ్యంతో దెయ్యం సినిమా కథను అప్పుడే రాసుకున్నారు

దెయ్యం కథ ముందుగా అక్కినేని వెంకట్‌కు వినిపించారు రామ్ గోపాల్ వర్మ. కథ నచ్చింది కానీ నాగార్జునకు సూట్ అవ్వదు అని వేరే ఏమైనా రాసుకొని రమ్మని చెప్పారు వెంకట్. ఆ తర్వాత తన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా శివ సినిమా కథని రాసుకొని వచ్చారు రాంగోపాల్ వర్మ. కథ బాగుంది కానీ నాగార్జున ఇమేజ్‌కి ఇది సరిపోదని రాఘవేంద్రరావు లాంటి దర్శకులు చెప్పడంతో వర్మకి ఆప్పుడు శివ ఛాన్స్ మిస్ అయింది.

అయితే సినిమా ఎలా తీయాలో మెళకువలు నేర్చుకుంటాను ఏదైనా సినిమాకి అసిస్టెంట్‌గా అవకాశం ఇవ్వమని వెంకట్‌ని కోరారు వర్మ. అప్పుడు నాగార్జున చేస్తున్న కలెక్టర్ గారి అబ్బాయి సినిమాకి అయిదో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. సినిమాకు సంబంధించిన స్క్రిప్టు విషయాల్లో చాలా హెల్ప్ చేశారు వర్మ. ఆ సినిమాకి బి.గోపాల్ డైరెక్టర్.

అలా బి.గోపాల్ దగ్గర ఓ వారం రోజుల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు వర్మ. సెట్లో వర్మ ప్రవర్తించే తీరు ఎవరికి నచ్చేది కాదట. కొంచెం యాటిట్యూడ్ చూపించేవారట వర్మ. దీంతో వర్మ ఉంటే మేము సినిమా చేయమని సెట్ లోని కొందరు వాదించడంతో వర్మని ఆ సినిమా నుంచి తీసేశారు. కానీ సినిమా జరుగుతున్నంతసేపు దూరంగా ఉండి గమనించేవారట వర్మ.

అలా నేర్చుకున్న పరిజ్ఞానం, బుక్స్‌తో సంపాదించిన నాలెడ్జ్ శివ సినిమాకి చాలా ఉపయోగపడిందని వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. శివ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ పేరు ఎంత మారుమోగింది అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీ చూడాలంటే శివ సినిమాకు ముందు శివ సినిమాకు తర్వాత అని మాట్లాడకుండా ఉండలేము.

Tags

Read MoreRead Less
Next Story