సినిమా

Rhea Chakraborty: ఫ్యాన్స్ కోసం రియా చక్రవర్తి ఎమోషనల్ పోస్ట్..

Rhea Chakraborty: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఒక్కసారిగా పెద్ద సంచలనాన్నే సృష్టించింది.

Rhea Chakraborty (tv5news.in)
X

Rhea Chakraborty (tv5news.in)

Rhea Chakraborty: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఒక్కసారిగా పెద్ద సంచలనాన్నే సృష్టించింది. అతడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినా కూడా.. అది హత్యే అని చాలామంది భావించడంతో పోలీసులు దానిని హత్య అన్న కోణంలోనే దర్యాప్తు చేశారు. ఆ కేసులో ప్రధాన నిందితురాలిగా మారింది హీరోయిన్ రియా చక్రవర్తి. ఇలా సంవత్సరం నుండి తాను ఎదుర్కున్న సందర్భాలు అన్నింటిని గుర్తుచేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రియా.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ముందు హత్యగా నమోదైనా.. ఆ తర్వాత పూర్తిగా డ్రగ్స్ కోణంలోకి వెళ్లిపోయింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతుందన్న కోణంలోకి కేసు మలుపు తిరిగింది. దాంట్లో రియా చక్రవర్తి ప్రధాన నిందితురాలిగా జైలు శిక్ష కూడా అనుభవించింది. తనతో పాటు తన తమ్ముడు ఈ కేసులో నిందితుడయ్యాడు.

ఇటీవల రియా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన సంవత్సరం పాటు గడిచిన జీవితం గురించి ఒక్క మాటలో చెప్పేసింది. 'ప్రస్తుతం నేను నవ్వడం మీరు చూస్తున్నారు. కానీ ఇక్కడ వరకు రావడం నాకు అంత సులభం కాలేదు. నిన్ను బ్రేక్ చేయనిది ఏదీ.. స్ట్రాంగ్‌గా చేయడానికి కారణం కాదు.. అందరికీ 2022 బాగుండాలి. ప్రేమతో నిండాలి' అని చెప్తూ రియా తన ఫోటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story

RELATED STORIES