సినిమా

Bigg Boss RJ Kajal Remuneration: బిగ్ బాస్ నుండి కాజల్ ఔట్.. 14 వారాలకు తన రెమ్యునరేషన్ ఎంతంటే..

Bigg Boss RJ Kajal Remuneration: బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి ఇంకా ఒక్క వారమే ఉంది.

RJ Kajal (tv5news.in)
X

RJ Kajal (tv5news.in)

Bigg Boss RJ Kajal Remuneration: బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి ఇంకా ఒక్క వారమే ఉంది. ఈ సీజన్‌లో చివరి ఎలిమినేషన్ ముగిసింది. ఈ వారం ఆర్‌జే కాజల్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఇన్నిరోజులుగా బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చిన కాజల్.. టాప్ 5కు చేరుకోలేకపోయింది. కాజల్‌కు ముందు నుండి హౌస్‌లో పలు రకాలుగా నెగిటివిటీ ఎదురయినా.. తాను మాత్రం ఇంతకాలం గేమ్ మీదే దృష్టిపెడుతూ వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ మొదలయినప్పటి నుండి కాజల్‌కు నెగిటివిటీ ఎదురయినా.. గత కొంతకాలంగా తాను మానస్, సన్నీలతో ఉంటున్న తీరు తనకు హౌస్‌లోనే కాదు.. ప్రేక్షకుల్లో కూడా సపోర్ట్ పెంచేలా చేసింది. సన్నీకి ఉన్న ఫ్యాన్ బేస్ కాజల్‌కు కూడా కలిసొచ్చింది. కానీ ఈసారి నామినేషన్లలో ఉన్న అందరితో పోలిస్తే కాజల్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో తాను టాప్ 5కు చేరుకునే ఒక్క వారం ముందు హౌస్ నుండి బయటికి వచ్చేసింది.

ఇక బిగ్ బాస్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నించిన కాజల్ రెమ్యునరేషన్ గురించి అప్పుడే టాక్ మొదలయిపోయింది. కాజల్.. వారానికి రూ.రెండు లక్షల ఉప్పందంతో హౌస్‌లోకి అడుగుపెట్టిందట. మొత్తం 14 వారాలకు కాజల్‌కు రూ. 30 లక్షలు అందినట్టు సమాచారం. హౌస్‌లోకి వచ్చిన కొత్తలో కాజల్‌కు రూ.30 లక్షలు అప్పు ఉన్నట్టుగా తెలిపింది. ఈ రెమ్యునరేషన్‌తో ఆ అప్పును తీర్చేసి మళ్లీ తన కెరీర్ మీద దృష్టిపెట్టే అవకాశాన్ని ఇచ్చింది బిగ్ బాస్.

Next Story

RELATED STORIES