సినిమా

Acharya Movie Update: ఆచార్య నుండి నీలాంబరి పాట.. ఎప్పుడంటే..

Acharya Movie Update: మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

Acharya Movie Update: ఆచార్య నుండి నీలాంబరి పాట.. ఎప్పుడంటే..
X

Acharya Movie Update: మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా గురించే ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ సినిమా నుండి ఒక అప్డేట్ విడుదలయ్యింది.

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటి నుండి అప్పుడో ఇప్పుడో తండ్రి కొడుకులు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ వీరిద్దరు పూర్తిస్థాయిలో కలిసి నటిస్తు్న్న తొలి చిత్రం ఆచార్య. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన వీరిద్దరి పోస్టర్లు ఆడియన్స్‌లో అంచనాలు పెంచేశాయి.

ఆచార్యలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. సిద్ధ పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్‌కు జోడీగా నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే కనిపించనుంది. ఇప్పటికే ఆచార్య నుండి లాహే లాహే అనే ఫోక్ సాంగ్ వైరల్ అయ్యింది. తాజాగా పూజా హెగ్డే, రామ్ చరణ్ మధ్య చిత్రీకరించిన డ్యూయట్‌ను నవంబర్ 5న విడుదల చేస్తున్నట్టుగా మూవీ టీమ్ పోస్టర్ ద్వారా ప్రకటించింది. నవంబర్ 5 ఉదయం 11.07కు పాట అభిమానుల ముందుకు రానుంది.

Next Story

RELATED STORIES