RRR Movie: ధర్మయుద్ధాలకు విజయం తథ్యం: ఆర్ఆర్ఆర్ నుండి డైలాగ్ వైరల్

RRR Movie (tv5news.in)

RRR Movie (tv5news.in)

RRR Movie: కొన్ని సినిమాల కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురుచూసినా తప్పు లేదనిపిస్తుంది.

RRR Movie: కొన్ని సినిమాల కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురుచూసినా తప్పు లేదనిపిస్తుంది. ముఖ్యంగా రాజమౌళి సినిమాల కోసం రెండు, మూడేళ్లు ఆగినా పరవాలేదనిపిస్తుంది. అంత వెయిటింగ్ తర్వాత రాజమౌళి సినిమా ద్వారా మనకు అందే విజువల్ ట్రీట్ అలాంటిది. విజువల్స్‌తోనే సగానికి పైగా మార్కులు కొట్టేసే రాజ‌మౌళి హీరోయిజంను చూపించడంలో కూడా దిట్ట. తన అప్‌కమింగ్‌ సినిమా ఆర్ఆర్ఆర్ నుండి అలాంటి హీరోయిజంను ఎలివేట్ చేసే డైలాగునే రిలీల్ చేశారు రాజమౌళి.

రాజమౌళి సినిమాల్లో హీరోలకు ఒక ఠీవీ ఉంటుంది. ఒక రాజసం ఉంటుంది. అవి హీరో క్యారెక్టరైజేషన్‌ను మరింత ఎలివేట్ చేసేలా ఉంటాయి. ముఖ్యంగా బాహుబలి తర్వాత పీరియాడిక్ డ్రామాలపై దృష్టి పెట్టిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్‌టీఆర్, రామ్ చరణ్ లుక్స్‌నే మార్చేశారు. ఇప్పటికే విడుదలయిన మేకింగ్ వీడియో, గ్లింప్స్‌లలో ఈ విషయం స్పష్టమవుతోంది.

ఆర్ఆర్ఆర్ టీజర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే గ్లింప్స్‌లో ఒక్క డైలాగు కూడా పెట్టలేదట. ప్రత్యేకంగా డైలాగ్స్‌తో టీజర్‌ను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నాడట ఈ దర్శక ధీరుడు. అయితే ఇంకా టీజర్ విడుదల కాకముందే సినిమాలోని ఒక డైలాగును బయటపెట్టేశాడు రాజమౌళి. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది.

'యుద్ధాన్ని వెతుక్కుంటే ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అవి ధర్మయుద్ధాలయితే విజయం తథ్యం.' అంటూ సాగే ఈ డైలాగును రాజమౌళి స్వయంగా బయటపెట్టారు. కానీ ఈ డైలాగును ఎవరు ఎవరికి చెప్తారు, ఏ సందర్భంలో చెప్తారు అన్న విషయాలు వెండితెరపైనే తెలుస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story