సినిమా

RRR Movie: ఆర్ఆర్ఆర్ నుండి నాటు పాట.. విడుదల ఎప్పుడంటే..

RRR Movie: ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

RRR Movie (tv5news.in)
X

RRR Movie (tv5news.in)

RRR Movie: ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి అటు రాజమౌళి ఫ్యాన్స్, ఇటు ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలయిన గ్లింప్స్ ఇంకా ప్రేక్షకుల మైండ్‌లో నుండి పోవట్లేదు. అప్పుడే ఆర్ఆర్ఆర్ నుండి మరో అప్డేట్ సిద్ధమయ్యింది.

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటివరకు ఒక్క పాట కూడా విడుదల అవ్వలేదు. దోస్తీ పేరుతో ఒక పాట విడుదలయినా కూడా అది అప్డేట్స్ ఇచ్చే వరకు ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడానికి రాజమౌళి చేసిన ప్రమోషనల్ స్టంట్ మాత్రమే. అయినా సౌత్‌లో ప్రతీ భాషతో పాటు హిందీలో కూడా విడుదలయిన దోస్తీ పాటకు ఆడియన్స్ దగ్గర నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ నుండి పాటల సందడి ఇప్పుడు మొదలు కానుంది.

నవంబర్ 10న ఆర్ఆర్ఆర్ నుండి మొదటి పాట విడుదల కానుంది. ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా మూవీ టీమ్ ప్రకటించింది. అయితే ఈ పోస్టర్‌లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. 'నాటు నాటు' అంటూ సాగే ఈ పాట కోసం ఈ ఇద్దరు హీరోలు మంచి మాస్ స్టెప్పులతో రెడీ అవుతున్నారని పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది.


Next Story

RELATED STORIES