RRR Movie: మరో రెండు నెలలు ఆర్ఆర్ఆర్‌తో ఎన్‌టీఆర్ బిజీ.. రాజమౌళి కోసమే..

RRR Movie (tv5news.in)

RRR Movie (tv5news.in)

RRR Movie: ఆర్ఆర్ఆర్.. ఈ పేరు చెప్పగానే అటు నందమూరి ఫ్యాన్స్.. ఇటు మెగా ఫ్యాన్స్ భీభత్సమైన అంచనాలను పెంచేసుకుంటున్నారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్.. ఈ పేరు చెప్పగానే అటు నందమూరి ఫ్యాన్స్.. ఇటు మెగా ఫ్యాన్స్ భీభత్సమైన అంచనాలను పెంచేసుకుంటున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ స్టేజ్‌లోకి ఎంటర్ అవుతున్న ఈ సమయంలో ఇంకే విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నాడట. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకుండానే ప్రమోషన్స్‌కి ఏం చేస్తే బాగుంటుందని మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నట్టు టాక్.

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలను తెరకెక్కించడంలో ఎంత పర్టికులర్‌గా ఉంటారో.. వాటి ప్రమోషన్స్ విషయంలో అంతకంటే ఎక్కువే పర్టికులర్‌గా ఉంటారు. ఎన్నో సినిమాలు ప్రమోషన్స్ ద్వారానే చాలామంది ప్రేక్షకులకు రీచ్ అయ్యి హిట్‌ను సాధించాయి. రాజమౌళికి ఉన్న పాపులారిటీకి ఆ ప్రమోషన్స్ అన్నీ అవసరం లేకపోయినా.. తను మాత్రం ప్రేక్షకులను ప్రమోషన్స్ దగ్గర నుండే ఎంటర్‌టైన్ చేయడం మొదలుపెడతాడు.

రాజమౌళి ఈసారి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ బాధ్యతను ఎక్కువగా హీరోలపైనే పెట్టారట. ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమాకు మెయిన్ ప్రేక్షకులు కాబట్టి ముందుగా వారినే టార్గెట్ చేయనున్నారట జక్కన్న. అందుకే వారి తరువాతి ప్రాజెక్టులను పక్కన పెట్టి మరీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టమని రాజమౌళి కోరారట. దీనికి ఎన్‌టీఆర్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

ఎన్‌టీఆర్.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తిచేసుకోగానే కొరటాల శివ ప్రాజెక్టును స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఆ సినిమా ప్రారంభాన్ని పోస్ట్‌పోన్ చేశారట ఎన్‌టీఆర్. అంతే కాకుండా తన డైరీ మొత్తం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌తోనే నింపేయనున్నాడని టాక్. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ఎలాగైనా బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story