సినిమా

RRR Movie: ఆర్ఆర్ఆర్‌లో ఐటమ్ సాంగ్ గురించి అడిగిన వ్యక్తికి మూవీ టీమ్ నుంచి అదిరిపోయే రిప్లై..

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ఇప్పుడు పూర్తిగా ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టింది.

RRR Movie (tv5news.in)
X

RRR Movie (tv5news.in)

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ఇప్పుడు పూర్తిగా ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టింది. అందుకే వెంటవెంటనే ఏదో ఒక అప్డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ నుండి రామ్ చరణ్, ఎన్‌టీఆర్ క్యారెక్టర్ గ్లింప్స్‌లు విడుదలయ్యాయి. అంతే కాక సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న అందరి ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ నుండి సోల్ ఆంథమ్ లాగా 'జనని' పాట కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్.

కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు లాంటి అలనాటి ఫ్రీడమ్ ఫైటర్స్ జీవితాన్ని కల్పితంగా చూపించాలనుకుని చాలా గొప్ప ప్రయత్నమే చేస్తున్నారు రాజమౌళి. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి ఇటీవల విడులదయిన ఒక్క టీజర్ చాలు. అంతే కాక సినిమాలో సోల్‌ను కళ్లకు కట్టేలా చూపిస్తున్న జనని పాట కూడా ఆర్ఆర్ఆర్ కథకు నిదర్శనం.

జనని పాట చాలా స్లోగా దేశభక్తి గీతం లాగా సాగిపోతుంది. అయితే ఈ పాట కాకుండా ఐటమ్ సాంగ్ రిలీజ్ చేయండి అంటూ ఓ నెటిజన్ ట్విటర్‌లో ట్వీట్ చేశాడు. దానికి ఆర్ఆర్ఆర్ టీమ్ 'ఏం నువ్వు చేస్తావా' అని రిప్లై ఇచ్చింది. ఈ రిప్లై చూసిన ప్రతీ ఒక్కరు ఆర్ఆర్ఆర్ టీమ్ కామెడీ టైమింగ్‌ను మెచ్చుకుంటున్నారు. ఎంతైనా ఆర్ఆర్ఆర్ టీమ్ అంటే ఆ మాత్రం క్రియేటివిటీ ఉండాల్సిందే కదా..
Next Story

RELATED STORIES