సినిమా

RRR Movie : RRR రిలీజ్ పై రాజమౌళి క్లారిటీ..!

RRR Movie : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి.

RRR Movie : RRR రిలీజ్ పై రాజమౌళి క్లారిటీ..!
X

RRR Movie : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వాటిని అరికట్టేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ కూడా విధించాయి. అంతేకాకుండా ధియేటర్లలో ఆంక్షలు కూడా విధించాయి. ఈ క్రమంలో అనుకున్న టైంకి ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి.

అయితే దీనిపైన దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చాడని బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నాడు. అనుకున్న టైంకి అంటే జనవరి 7న ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ అవుతుందని వాయిదా వేసే ప్రసక్తి లేదని రాజమౌళి తనతో చెప్పినట్టుగా తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కీరవాణి సంగీతం అందించాడు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.

Next Story

RELATED STORIES