RRR నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌‌కి పండగే...!

RRR నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌‌కి పండగే...!
RRR Update : దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ మెయిన్ లీడ్‌‌లో నటిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు

RRR Update : దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ మెయిన్ లీడ్‌‌లో నటిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లుక్స్, వీడియోలు సినిమా పైన భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ముందుగా ఈ సినిమాని దసరాకే విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేశారు.

ఇదిలావుండగా చిత్ర యూనిట్ సినిమా నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో రేపు ఓ అప్డేట్‌‌ను ఇవ్వబోతున్నట్టుగా వెల్లడించింది. ''ప్రపంచంలోని ఏ సినిమాకూ ఎవరూ కనీవినీ ఎరుగని కొలాబరేషన్‌‌ను మీకు పరిచయం చేస్తున్నాం. దానికదే సాటి. దానిని చూసేందుకు అక్టోబర్ 29న (రేపు) వరకు వేచి చూడండి. '' అంటూ ట్వీట్ చేసింది. తాజా సమాచారం ప్రకారం దీపావళి సందర్భంగా సినిమాకి సంబంధించిన టీజర్‌‌ని విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది.

ఇదే అయితే అభిమానులకి పండగేనని చెప్పాలి. కాగా మొత్తం పది భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి విజేయంద్రప్రసాద్ కథని అందించారు.


Tags

Read MoreRead Less
Next Story