సినిమా

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్‌కు మెగాస్టార్ గుడ్ న్యూస్..

Sai Dharam Tej: తమ అభిమాన హీరోకు ఏం జరిగినా ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేరు.

Sai Dharam Tej (tv5news.in)
X

Sai Dharam Tej (tv5news.in)

Sai Dharam Tej: తమ అభిమాన హీరోకు ఏం జరిగినా ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేరు. అది వారి సొంత మనిషికి జరిగినట్టే ఫీల్ అవుతారు. అభిమాన హీరోలను ఇంట్లో మనుషుల్లాగా భావిస్తారు. వారికి చిన్న గాయం తగిలినా.. అది తగ్గాలని కోరుకుంటారు. హీరోల మంచి కోరే వారే అభిమానులు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ కూడా ఇలాగే కోరుకుంటున్నారు. వారి కోరికలు ఇన్నాళ్లకు తీరాయి.

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఒక్కసారిగా మెగా ఫ్యామిలీని ఉలిక్కిపడేలా చేసింది. సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జిపై బైక్‌పై వెళ్తుండగా స్కిడ్ అయ్యి బైక్ మీద నుండి పడ్డాడు సాయి ధరమ్ తేజ్. ఈ ప్రమాదంలో తన చేయి ఫ్రాక్చర్ అవ్వడంతో చాలారోజులు తాను డాక్టర్‌ల పర్యవేక్షణలోనే ఉన్నాడు. అందుకే తన సినిమా విడుదల అయినా కూడా సాయి ధరమ్ తేజ్ వాటి ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోయాడు. చాలాకాలం తర్వాత సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్‌కు మెగా ఫ్యామిలీ ఒక శుభవార్త చెప్పింది.


సాయి ధరమ్ తేజ్ కాస్త కోలుకున్న తర్వత తాను ఇంటికి వచ్చేశాడు. ఈ కోలుకుంటున్న క్రమంలో తాను అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అప్డేట్స్‌ను పంచుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌ పూర్తిగా కోలుకున్నాడు. దీంతో మెగా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. వీరందరు కలిసి దిగిన ఫోటోను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES