సినిమా

Salman Khan: మళ్లీ ఆ తెలుగు రైటర్‌తోనే సల్మాన్ సినిమా.. తన హిట్ చిత్రానికి సీక్వెల్‌గా..

Salman Khan: బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ ఈరోజు తన 56వ ఏట అడుగుపెడుతున్నాడు.

Salman Khan: మళ్లీ ఆ తెలుగు రైటర్‌తోనే సల్మాన్ సినిమా.. తన హిట్ చిత్రానికి సీక్వెల్‌గా..
X

Salman Khan: బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ ఈరోజు తన 56వ ఏట అడుగుపెడుతున్నాడు. అందుకే ఆయన ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాను పుట్టినరోజు శుభాకాంక్షలతో నింపేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీని తన ఛార్మ్‌తో ఏలేస్తున్న సల్మాన్ ఖాన్ ఓ సెల్ఫ్ మేడ్ స్టార్. అయితే గత కొంతకాలంగా సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గించిన సల్మాన్ ఖాన్.. బర్త్‌డే సందర్భంగా తన హిట్ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేశాడు.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎంత గొప్ప రైటర్ అని అందరికీ తెలుసు. అందుకే చాలామంది హీరోలు ఆయన కథలో నటించాలని కోరుకుంటారు. కేవలం తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా ఆయన కథల కోసం ఎదురుచూసే హీరోలు ఉన్నారు. బాలీవుడ్ నుండి కూడా విజయేంద్ర ప్రసాద్ ఎన్నో ఆఫర్లు అందుకున్నారు. కానీ.. ఆయన మాత్రం పెద్దగా ఆ వైపు వెళ్లడానికి ఆసక్తి చూపించలేదు.

అయితే సల్మాన్ ఖాన్ పర్సనల్‌గా ఒక కథ కావాలని విజయేంద్ర ప్రసాద్‌ను అడగగానే ఆయన కాదనలేకపోయారు. అందుకే ఆయన కోసం రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా ప్రేక్షకుల మనసుకు హత్తుకుపోయే 'భజరంగీ భాయ్‌జాన్' లాంటి ఓ కథను సిద్ధం చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌ను అనౌన్స్ చేశాడు సల్మాన్.తన పుట్టినరోజు సందర్భంగా సల్మాన్ ఖాన్ తన సినిమా న్యూస్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వనున్నాడు. తన అభిమానులకు మాత్రమే కాదు.. చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులకు ఇష్టమైన భజరంగీ భాయ్‌జాన్‌కు సీక్వెల్‌గా 'పవనపుత్ర భాయిజాన్' సినిమాను సిద్ధం చేస్తున్నాడు సల్మాన్. ఈ సీక్వెల్‌కు కూడా విజయేంద్ర ప్రసాదే కథను అందించనున్నారు.

Next Story

RELATED STORIES