సినిమా

Salman Katrina: సల్మాన్ ఖాన్ పుట్టినరోజున కత్రినా కైఫ్ ఖరీదైన బహుమతి..

Salman Katrina: బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల తన 56వ ఏట అడుగుపెట్టారు.

Salman Katrina: సల్మాన్ ఖాన్ పుట్టినరోజున కత్రినా కైఫ్ ఖరీదైన బహుమతి..
X

Salman Katrina: బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల తన 56వ ఏట అడుగుపెట్టారు. బీ టౌన్‌లో ఏ యాక్టర్‌కు ఏ కష్టం వచ్చినా.. ముందుండే సల్మాన్ అంటే చాలామందికి ఇష్టం. అందుకే ఆయన పుట్టినరోజున సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అందరూ విషెస్‌తో సల్మా్న్‌ను సంతోషపెట్టారు. అంతే కాక పలువురు నటీనటులు ఖరీదైన బహుమతులను కూడా పంపించారు. అందులో కత్రినా కైఫ్ పంపించిన బహుమతి ప్రస్తుతం బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ ఎప్పటినుండో స్నేహితులు. యాక్టింగ్ అంటే ఆసక్తి ఉన్న కత్రినా.. బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలవడానికి కారణం సల్మానే. ఈ విషయం కత్రినానే చాలాసార్లు వెల్లడించింది కూడా. ఒకానొక సమయంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. కత్రినా.. ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

కత్రినా పెళ్లి సమయంలో సల్మాన్‌పై సోషల్ మీడియాలో చాలానే ట్రోలింగ్ జరిగింది. సల్మాన్ ఎవరినీ ప్రేమించినా.. వారు కచ్చితంగా వేరే హీరోను పెళ్లి చేసుకొని వెళ్లిపోతారని తనపై ఫన్నీ మీమ్స్ వైరల్ అయ్యాయి. కానీ సల్మాన్ మాత్రం అవేవి పట్టించుకోకుండా కత్రినా, విక్కీ పెళ్లి సాఫీగా జరగడానికి సహాయం చేశాడు. అందుకే కత్రినా కూడా తన స్నేహాన్ని మర్చిపోకుండా పుట్టినరోజుకు ఓ ఖరీదైన బహుమతిని పంపించింది.

సల్మాన్ ఖాన్‌కు బ్రేస్‌లెట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే తన చేతికి ఎప్పుడూ ఓ బ్రేస్‌లెట్ ఉంటుంది. అందుకే కత్రినా.. సల్మాన్ పుట్టినరోజున తనకు ఇష్టమైన బ్రేస్‌లెట్‌నే గిఫ్ట్‌గా ఇచ్చింది. రెండు నుండి మూడు లక్షలు విలువ చేసే ఒక బంగారు బ్రేస్‌లెట్‌ను సల్మా్న్ పుట్టినరోజున బహుకరించిందట కత్రినా. తను మాత్రమే కాదు ఇంకా ఎందరో బాలీవుడ్ నటీనటులు కూడా లక్షల్లో విలువ చేసే బహుమతులను సల్మాన్‌కు అందజేశారు.

Next Story

RELATED STORIES