సినిమా

Samantha : 'ప్రతి ఫ్రేమ్‌లోనూ అదరగొట్టేశావ్'.. బన్నీ పై సామ్ ప్రశంసలు..!

Samantha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం పుష్ప ధియేటర్లో సందడి చేస్తోంది.

Samantha : ప్రతి ఫ్రేమ్‌లోనూ అదరగొట్టేశావ్.. బన్నీ పై సామ్ ప్రశంసలు..!
X

Samantha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం పుష్ప ధియేటర్లో సందడి చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటించాడు. బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సినిమాకి తొలి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ళ పరంగా దూసుకుపోతోంది.

ఇదిలావుండగా బన్నీ పై స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసల జల్లు కురిపించింది. సినిమాని చూసిన సామ్.. అనంతరం ఇన్‌‌‌స్టా‌‌‌గ్రామ్ వేదికగా స్పందించింది. '' చిత్తూరు యాస నుంచి భుజాన్ని పైకి పెట్టే మేనరిజం వరకూ ప్రతి ఫ్రేమ్‌లోనూ అదరగొట్టేశారు బన్నీ.. ప్రేక్షకులను కట్టిపడేసే ప్రదర్శన.. తన నటనతో ప్రతిక్షణం స్ఫూర్తినింపితే అలాంటి నటీనటులను నేను ఎల్లప్పుడూ ప్రేరణగా తీసుకుంటాను.. 'పుష్ప'లో అల్లు అర్జున్‌ నాకు అలాగే అనిపించారు" అని సామ్ పోస్ట్ చేసింది.

సామ్ పోస్ట్ పై బన్నీ స్పందించాడు. ''డియర్‌ సమంత. మీరు నాపై కురిపించిన ఈ ప్రశంసలకు ధన్యవాదాలు. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి'' అని బన్నీ రిప్లై ఇచ్చాడు. కాగా ఈ సినిమాలో సామ్ ఐటెమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.


Next Story

RELATED STORIES