సినిమా

Samantha: సమంతకు అరుదైన గౌరవం.. దక్షిణాది తొలి భారత నటిగా..!

Samantha: సినీ నటీ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేసింది.

Samantha: సమంతకు అరుదైన గౌరవం..  దక్షిణాది తొలి భారత నటిగా..!
X

Samantha: సినీ నటీ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేసింది. సినిమాలతో పాటుగా ఈవెంట్స్, షోలలో కూడా ఆమె స్పెషల్‌ గెస్ట్‌గా హాజరవుతున్నారు. ఇదిలావుండగా ఇప్పుడు సామ్ కి అరుదైన గౌరవం దక్కింది.. ఈ నెల(నవంబర్) గోవాలో జరిగే 'ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా'(ఐఎఫ్‌ఎఫ్‌ఐ) కార్యక్రమానికి స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం అందింది.

నవంబర్‌ 20 నుంచి 28 వరకు గోవాలో జరిగే ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్‌ఎఫ్‌ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు. ఈ ఈవెంట్‌లో స్పీకర్‌గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది భారత నటి సమంతనే కావడం విశేషం.. కాగా ఈ కార్యక్రమానికి సమంతతో పాటుగా బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ భాజ్‌పాయికి కూడా ఆహ్వానం దక్కింది.

కాగా సమంత ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

Next Story

RELATED STORIES