సినిమా

Samantha: 'నేర్చుకోవాల్సింది చాలా ఉంది'.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సామ్..

Samantha: హీరోయిన్ సమంత ముందు నుండి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే వ్యక్తే.

Samantha (tv5news.in)
X

Samantha (tv5news.in)

Samantha: హీరోయిన్ సమంత ముందు నుండి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే వ్యక్తే. కానీ ఈమధ్య తాను మరికాస్త ఎక్కువగానే సోషల్ మీడియాపై దృష్టిపెడుతోంది. తన సినిమా అప్డేట్స్‌ను పక్కన పెడితే ఫోటోషూట్‌లు, జీవితంలో ఇన్‌స్పైర్ చేసే కోట్స్ లాంటివి ఎక్కువగా పోస్ట్ చేస్తోంది. తాజాగా అలాంటిదే మరొక కోట్‌ను పోస్ట్ చేసింది సామ్.

సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. అంతే కాక త్వరలోనే బాలీవుడ్‌లో కూడా తాను అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు దగ్గరయిన సామ్.. మరోసారి అదే టీమ్‌తో కలిసి మరో వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉందట.

ఇలా ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అయిపోయినా కూడా.. సమంత తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండడం మాత్రం ఎప్పుడూ మిస్ అవ్వదు. ఇటీవల జరిగిన ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేసిన సామ్.. వాటి ద్వారా లైకుల మీద లైకులు కొట్టేస్తోంది. ఇటీవల మరో స్టోరీతో అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.

'నేను జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠం ఏంటంటే నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అన్న నిజమే' అని అర్థం వచ్చే కోట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది సామ్. అంతే కాకుండా జీవితంలో జరిగే ప్రతీ విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటూ మరో కోట్‌ను పెట్టింది. ఇటీవల సామ్ ఇలాంటి కోట్స్ పెట్టడం చాలా కామన్‌గా మారిపోయింది.

Next Story

RELATED STORIES