Samantha : అంతా బాగుంటే సామ్‌ చెప్పినట్టుగానే జరిగుండేదేమో : ప్రెగ్నెన్సీ కామెంట్స్‌ వైరల్

Samantha : అంతా బాగుంటే సామ్‌ చెప్పినట్టుగానే జరిగుండేదేమో : ప్రెగ్నెన్సీ కామెంట్స్‌ వైరల్
Samantha : చైసామ్ విడిపోయి అయిదు నెలలు అవుతున్న వీరిద్దరికి సంబంధించిన ఏ టాపిక్ అయిన ఇప్పటికీ హాట్ గానే మారుతోంది.

Samantha : చైసామ్ విడిపోయి అయిదు నెలలు అవుతున్న వీరిద్దరికి సంబంధించిన ఏ టాపిక్ అయిన ఇప్పటికీ హాట్ గానే మారుతోంది. టాలీవుడ్‌‌లో స్టార్ అండ్ క్రేజీ కపుల్‌‌గా పేరు సంపాదించుకున్న ఈ జంట.. గతేడాది అక్టోబర్‌ 2న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. నాలుగేళ్లు అన్యోన్యంగా జీవించిన ఈ జంట విడిపోవడం అభిమానులు ఎవ్వరు కూడా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

మళ్ళీ వీరిద్దరూ కలిస్తే బాగుండని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో వారిద్దరూ అన్యోన్యంగా ఉన్న పాత వీడియోలు, గతంలో ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్‌ను ఫ్యాన్స్‌ గుర్తుచేసుకుంటూ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో తన ప్రెగ్నెన్సీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది సామ్.. 2019లో ఓసారి సమంత సోషల్‌ మీడియాలో లైవ్‌చాట్‌ నిర్వహించింది.

ఇందులో నెటిజన్లు తన ప్రెగ్నెన్సీ ఫై ప్రశ్నలు అడగగా, దానికి సామ్ స్పందిస్తూ.. 2022 ఆగస్ట్‌ 7వ తేదీ ఉదయం 7గంటలకు ఓ బిడ్డకు జన్మనివ్వబోతోన్న అంటూ కామెంట్ చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ వైరల్ గా మారింది. అంతా బాగుంటే సామ్‌ చెప్పినట్టుగానే ఈ ఏడాది వారికి ఓ బిడ్డ కూడా పుట్టేదని అభిమానులు అనుకుంటున్నారు. కాగా ప్రస్తుతం చైసామ్ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story