సినిమా

చైతూ కోసమే నేనప్పుడలా.. : సమంత

యుక్త వయసులో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేశాను. వాటిని మళ్లీ ఒకసారి రివైజ్ చేసుకుంటే

చైతూ కోసమే నేనప్పుడలా.. : సమంత
X

ఏదైనా ఒక పాత్రను అంగీకరిస్తే ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది సమంత.. నటనలో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల ప్రశంసలందుకుంటోంది. లాక్‌డౌన్ పీరియడ్‌లో ఖాళీగా కూర్చోకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నటనలో మెళకువలు నేర్చుకుంటూ, గార్డెనింగ్ చేస్తూ చాలా బిజీగానే ఉంది సామ్. బుల్లితెరమీద కూడా సందడి చేస్తున్న సమంత ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న 'కాతువక్కుల రెండు కాదల్' షూట్ కోసం చెన్నైలో ఉంటోన్న సామ్ తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

చాలా కాలం తరువాత చెన్నై వచ్చినందుకు సంతోషంగా ఉంది.. స్నేహితులను, తల్లిదండ్రులను కలవడం ఆనందంగా ఉంది. తమిళ్ మాట్లాడడం మరింత బావుంది..

ఇప్పటి వరకు తనకు నచ్చిన పాత్రల గురించి చెబుతూ.. ఓ బేబీ, దిఫ్యామిలీ మ్యాన్ 2 అని చెప్పారు.

నచ్చిన పుస్తకాలు.. Asterix And Obelix చిన్నప్పుడు నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. అలాగే శాంతారామ్, మహాభారతం కూడా.

యుక్త వయసులో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేశాను. వాటిని మళ్లీ ఒకసారి రివైజ్ చేసుకుంటే పరిణతితో ఆలోచిస్తే బావుండేదని అనిపిస్తుంది. అందుకే గ్రో అప్ అని చెప్పుకుంటా.

2020లో గుర్తుండిపోయే అంశం.. రానా, మిహిక వివాహం

సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి.. కొంతకాలం క్రితం వరకు ఆ కామెంట్లు నన్ను బాధించేవి.. దాంతో నిద్రలేని రాత్రులెన్నో గడిపాను. కానీ ఇప్పుడు వాటిని చూసి నవ్వుకోవడం అలవాటు చేసుకున్నాను.

యోగా, జిమ్‌ని చాలా ఇష్టంగా చేయడానికి కారణం.. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని అతి పెద్ద రహస్యం.. చైని కలవడం కోసం జిమ్‌లో జాయినయ్యాను. అలా మొదటి సారి జిమ్‌‌కు వెళ్లడం ప్రారంభించాను.

ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి బయటపడాలంటే.. ధ్యానం, శ్వాస మీద పూర్తి ధ్యాస ఉంచాలి. శ్వాసపై నియంత్రణ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుంది..

Next Story

RELATED STORIES