సినిమా

Samantha on Pushpa : పుష్ప ట్రైలర్ పై సమంత ట్వీట్.. !

amantha on Pushpa : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌‌‌లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

Samantha on Pushpa : పుష్ప ట్రైలర్ పై సమంత ట్వీట్.. !
X

Samantha on Pushpa : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌‌‌లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పైన వీపరితమైన హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌‌‌ని రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ బన్నీ అభిమానులను వీపరితంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్, డైలాగ్ లకి ఫిదా అయిపోతున్నారు. ఇదిలావుండగా చిత్ర ట్రైలర్ పైన టాప్ హీరోయిన్ సమంత స్పందించింది. "పుష్పా రాజ్.. తగ్గదే.. లే" అని రాసి పైర్ ఎమోజీని ట్వీట్ చేసింది. కాగా సామ్ ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా పుష్ప చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా మొదటిభాగం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నారు. మొత్తం నాలుగు భాషలలో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Next Story

RELATED STORIES