సినిమా

Samantha Item Song: సెక్సీగా కనిపించడం చాలా కష్టం.. 'పుష్ప' పాటపై సామ్ కామెంట్స్..

Samantha Item Song: స్పెషల్ సాంగ్స్ అనేవి మాస్ కమర్షియల్ సినిమాల్లో ఓ కొత్త ఊపును తీసుకొస్తాయి.

Samantha Item Song: సెక్సీగా కనిపించడం చాలా కష్టం.. పుష్ప పాటపై సామ్ కామెంట్స్..
X

Samantha Item Song: స్పెషల్ సాంగ్స్ అనేవి మాస్ కమర్షియల్ సినిమాల్లో ఓ కొత్త ఊపును తీసుకొస్తాయి. కమర్షియల్ సినిమాలకు ఫైట్స్ ఎంత ముఖ్యమో.. స్పెషల్ సాంగ్ కూడా అంతే ముఖ్యం అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సంవత్సరం విడుదలయిన తెలుగు సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ లాస్ట్‌గా వచ్చినా టాప్ పొజిషన్‌ను సంపాదించుకుంది 'పుష్ప'లోని 'ఊ అంటావా.. ఊఊ అంటావా'.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో పుష్ప సినిమాపై ముందు నుండి భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగినట్టుగానే పుష్ప.. ఓపెనింగ్స్ విషయంలో ఫైర్‌నే చూపించింది. అంతే కాకుండా ఈ సినిమా నుండి విడుదలయిన ప్రతీ ఒక్క పాట యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అందులోనూ ముఖ్యంగా సమంత నటించిన ఐటెమ్ సాంగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

మామూలుగా పాట ఎంతో బాగుంటే కానీ.. దాని లిరికల్ వీడియోకు మిలియన్లలో వ్యూస్ రావడం కష్టం. అలాంటిది పుష్పలోని సమంత ఐటెమ్ సాంగ్ విడుదలయ్యి పదిరోజులు తిరగక ముందే 100 మిలియన్ల మార్కును టచ్ చేసింది. కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, మలయాళ, హిందీ, కన్నడ.. ఇలా అన్ని భాషల్లో కలిపితేనే ఈ వ్యూస్ వచ్చినా కూడా ఈ పాటను ప్రతీ భాషలో ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో అర్థమవుతోంది.

సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా 'ఊ అంటావా.. ఊఊ అంటావా' పాటకు ట్యాగ్ ఇచ్చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే సమంత ఈ పాట గురించి ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తాను ఎన్నో క్యారెక్టర్లు చేశానని, ఎన్నో పాత్రలలో కనిపించానని.. కానీ అవేమీ తనకు కష్టంగా అనిపించలేదని తెలిపింది. పుష్పలోని ఐటెమ్ సాంగ్‌లో సెక్సీగా కనిపించడం కోసం మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పింది.


Next Story

RELATED STORIES