Samantha Ruth Prabhu : గుర్తుపెట్టుకోండి.. ఎల్లప్పుడూ ఏదైన శుభవార్త వస్తూనే ఉంటుంది.. వైరల్

Samantha Ruth Prabhu : గుర్తుపెట్టుకోండి.. ఎల్లప్పుడూ ఏదైన శుభవార్త వస్తూనే ఉంటుంది.. వైరల్
Samantha Ruth Prabhu : టాలీవుడ్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Samantha Ruth Prabhu : టాలీవుడ్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వ్యక్తిగత విషయాలతో పాటుగా సినిమాకి సంబంధించిన అప్డేట్‌‌లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ మధ్య సమంత ఏ పోస్ట్ పెట్టిన సరే అది వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సామ్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

'గుర్తు పెట్టుకోండి.. ఎల్లప్పుడూ ఏదైన శుభవార్త వస్తూనే ఉంటుంది' అని రాసి ఉన్న ఫొటోను పంచుకుంది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌‌‌‌గా మారింది. అయితే ఆ మంచి ఏమై ఉంటుందని నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వచ్చేసరికి తెలుగులో ఆమె నటించిన 'శాకుంతలం' మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకని విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఈ మధ్యే మరో రెండు కొత్త సినిమాలకి సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.



Tags

Read MoreRead Less
Next Story