సినిమా

Samantha Ruth Prabhu: మరోసారి విలన్‌గా సమంత..

Samantha Ruth Prabhu: ఓ తమిళ చిత్రంలో మరో డిఫరెంట్ రోల్‌కు ఓకే చెప్పిందట సామ్.

Samantha Ruth Prabhu: మరోసారి విలన్‌గా సమంత..
X

Samantha Ruth Prabhu: సమంత రుత్ ప్రభు గత కొంతకాలంగా చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ అనే పాత్రలో విలన్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన సమంత.. పుష్పలో చేసిన స్పెషల్ సాంగ్‌తో తాను హాట్‌నెస్‌ను కూడా బ్యాలెన్స్ చేయగలనని నిరూపించింది. ఈ రెండు తన కెరీర్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తాజాగా ఓ తమిళ చిత్రంలో మరో డిఫరెంట్ రోల్‌కు ఓకే చెప్పిందట సామ్.

ప్రస్తుతం సమంత ఎక్కువశాతం లేడీ ఓరియెంటెడ్, పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తోంది. కమర్షియల్ సినిమాల నుండి సామ్ కాస్త దూరంగానే ఉంటోంది. ఒకవేళ కమర్షియల్ సినిమాల్లో కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఒప్పుకుంటోంది. తాజాగా తాను సైన్ చేసిన ఓ కమర్షియల్ సినిమాలో సమంతది నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని టాక్ వినిపిస్తోంది.

సమంత నేరుగా తమిళ చిత్రం చేసి చాలాకాలమే అయ్యింది. తాను నటించిన తెలుగు సినిమాలు తమిళంలో కూడా విడుదల అవుతున్నాయే తప్ప సమంత నేరుగా కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించి మూడు సంవత్సరాలు అవుతోంది. చాలాకాలం తర్వాత సమంత చేస్తున్న స్ట్రెయిట్ తమిళ చిత్రమే 'కాతు వాకుల రెండు కాదల్'.

నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతపతి హీరోగా నటిస్తున్నాడు. సమంత, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇందులో సమంతది నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్ర అని సమాచారం. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2లో పూర్తిస్థాయి విలన్ రోల్‌లో నటించిన సమంత.. ఇలాంటి ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో తన విలనిజంతో ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పిస్తుందో మరి..

Next Story

RELATED STORIES