సినిమా

Samantha Ruth Prabhu: దాని గురించి ఇంక మాట్లాడను: విడాకుల ప్రశ్నకు సమంత సమాధానం

Samantha Ruth Prabhu: సమంత విడాకుల తర్వాత సినిమాల్లో మరింత యాక్టివ్ అయిపోయింది.

Samantha Ruth Prabhu: దాని గురించి ఇంక మాట్లాడను: విడాకుల ప్రశ్నకు సమంత సమాధానం
X

Samantha Ruth Prabhu: సమంత విడాకుల తర్వాత సినిమాల్లో మరింత యాక్టివ్ అయిపోయింది. తనకు నచ్చిన రోల్స్ ఎంచుకుంటూ, స్పెషల్ సాంగ్స్‌లో కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అంతే కాదు ఇటీవల సమంత నేషనల్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా పాపులారిటీని సంపాదించుకుంటుంది. తాజాగా విడాకులపై చివరిసారిగా స్పందించింది సమంత.

టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా తమ విడాకుల గురించి స్పష్టం చేశారు. ఆ తర్వాత నాగచైతన్య తన సినిమా షూటింగ్స్‌తోనే బిజీగా ఉన్నాడు. పెద్దగా ఈవెంట్స్‌కు రావడం, ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లాంటివి చేయలేదు. కానీ సమంత అలా కాదు. ఎక్కువగా ఈవెంట్స్‌కు వెళ్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి తాను ఎక్కువగా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తాజాగా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత పర్ఫార్మెన్స్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. అయితే ఆ అవార్డు అందుకోవడానికి వెళ్లిన సమంతకు రెడ్ కార్పెట్‌పై మరోసారి తన విడాకులకు సంబంధించిన ప్రశ్నే ఎదురయ్యింది. దానికి సమాధానంగా సమంత.. తాను ఇప్పటికీ దీని గురించి చాలా మాట్లాడానని, ఇంక అదే రిపీట్ చేయాలని అనుకోవట్లేదని తెలిపింది.

Next Story

RELATED STORIES