సినిమా

Samantha : 'మీరు లేకుండా నేను ఏం చేయగలను' .. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

Samantha : సినిమాల మధ్యలో ఏ మాత్రం గ్యాప్ దొరికిన సరే.. తన స్నేహితులతో కలిసి షికార్లు చేస్తోంది.

Samantha : మీరు లేకుండా నేను ఏం చేయగలను .. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

Samantha : టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టాలీవుడ్‌‌లో గుణశేఖర్‌ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్‌ పనుల్లో చివరి దశకి చేరింది. ఇక 'యశోద' చిత్రం మొదటి షెడ్యూల్‌ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇవేకాకుండా కాతువాకుల రెండు కాదల్‌, తదిదర బాలీవుడ్‌, హాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌తో బీజీగా ఉంది సామ్‌.

సినిమాల మధ్యలో ఏ మాత్రం గ్యాప్ దొరికిన సరే.. తన స్నేహితులతో కలిసి షికార్లు చేస్తోంది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్రెండ్స్‌తో గడిపేందుకు ఇష్టపడుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది సామ్.. రాహుల్‌ రవీంద్రన్‌, కమెడియన్‌ వెన్నెల కిషోర్‌లతో కలిసి ఉన్న ఒక ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.

సామ్ షేర్ చేసిన ఈ ఫోటోలో ముగ్గురూ రిక్లైనర్‌ సోఫాలో పడుకుని ఉండగా రాహుల్‌ సెల్ఫీ తీశాడు. ఈ ఫొటో స్టోరీలో షేర్‌ చేస్తూ 'మీరు లేకుండా నేను ఏం చేయగలను' అని రాసుకొచ్చింది సామ్‌. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో పాటుగా 'సులభతరమైన గతం లేని దృఢమైన వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు' అని మరొక స్టోరీ షేర్‌ చేసింది సామ్‌.Next Story

RELATED STORIES