సినిమా

Samantha: ప్రియాంక చోప్రా వీడియోను షేర్ చేసిన సమంత.. ఇంతకీ అందులో ఏముంది..?

Samantha: ప్రస్తుతం సమంత టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వుడ్స్‌ను చుట్టేస్తోంది.

Samantha: ప్రియాంక చోప్రా వీడియోను షేర్ చేసిన సమంత.. ఇంతకీ అందులో ఏముంది..?
X

Samantha: ప్రస్తుతం సమంత టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వుడ్స్‌ను చుట్టేస్తోంది. సౌత్ వారితోనే కాదు.. నార్త్ నటీనటులతో కూడా సామ్ సన్నిహితంగానే ఉంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. టాలీవుడ్, కోలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్ భామల పుట్టినరోజులకు కూడా విషెస్ చెప్తోంది. అంతే కాదు వారికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తోంది. తాజాగా అలా ప్రియాంక చోప్రా వీడియోను తన స్టోరీలో షేర్ చేసింది సమంత.

బాలీవుడ్‌కే టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగిపోతున్న దీపికా పదుకొనె పుట్టినరోజు నేడు. అయితే తన ఫోటోను స్టోరీలో షేర్ చేయడంతో పాటు తనకు చాలా స్పెషల్‌గా బర్త్‌డే విషెస్‌ను అందించింది సామ్. దీపికా బర్త్‌డే చాలా స్పెషల్ అవ్వాలని కోరుకుంది సామ్. తనకు ప్రతీరోజు ప్రేమతో, మనశ్శాంతితో పూర్తవ్వాలని, మొదలవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. ఇదిలా ఉండగా మరో హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సంబంధించిన వీడియోను ఒకటి తన స్టోరీలో షేర్ చేసింది సమంత.


ఎవరి సంపాదన వారికి ఉండాలి, ఎవరి కాళ్ల మీద వారు బ్రతకాలి అని చెప్తూ ఎప్పుడూ నలుగురికి మోటివేషన్ ఇచ్చేలాగా మాట్లాడుతుంది ప్రియాంక చోప్రా. ఈ మధ్య సమంత కూడా అమ్మాయిలు ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలి, వారికి తల్లిదండ్రులు ఎలా సపోర్ట్ చేయాలి అనే విషయాలను ఎక్కువగా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అలా ప్రియాంక చోప్రా చెప్పిన ఓ సందేశాన్ని తన స్టోరీలో పెట్టి, ప్రియాంకను కూడా ట్యాగ్ చేసింది సామ్.


'నా తండ్రి నేను చిన్నగా ఉన్నప్పటి నుండి నాకొక విషయం చెప్తూ ఉండేవాడు. నువ్వు ఎవ్వరి కూతురైనా, నువ్వు ఎవ్వరిని పెళ్లి చేసుకున్నా.. అన్నింటికంటే ముందు ఆర్థికంగా నువ్వు ధృడంగా ఉండాలి. ఆ మాట నాలో బలంగా నాటుకుపోయింది. 12 ఏళ్లు వచ్చేసరికి నేను ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నాను' అంటూ ప్రియాంక చెప్పిన మాటలను తన స్టోరీలో పెట్టి తనను ట్యాగ్ చేసింది సామ్. అంతే కాకుండా ఒక లవ్ ఎమోజీ కూడా దానికి జతచేసింది.


Next Story

RELATED STORIES