Chaysam Wedding: సమంత పెళ్లి చీర.. అంతటా హాట్ టాపిక్..

Chaysam Wedding: సమంత పెళ్లి చీర.. అంతటా హాట్ టాపిక్..
Chaysam Wedding: ఎవరి జీవితంలో అయినా పెళ్లి చాలా ముఖ్యమైన ఘట్టం. అందుకే దాన్ని ప్రత్యేకంగా చేసుకోవాలని భావిస్తారు.

Chaysam Wedding: ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అందుకే ఆ పెళ్లిరోజును ప్రత్యేకంగా చేసుకోవాలని భావిస్తారు. మామూలు వారే ఇంతలా ఆలోచిస్తే.. మరి రెండు చేతులా సంపాదించే సినీ సెలబ్రిటీలు వారి పెళ్లి గురించి ఎన్ని కలలు కంటుంటారు కదా.. అందుకేనేమో ఏ హీరో లేదా హీరోయిన్ వారి పెళ్లిని ప్రేక్షకులంతా కొన్నాళ్ల వరకు మాట్లాడుకునేంత ఆర్భాటంగా చేసుకుంటారు. అలాగే జరిగింది నాగచైతన్య, సమంతల పెళ్లి కూడా.

నాగచైతన్య హిందూ, సమంత క్రిస్టియన్.. కానీ వారి మతాలు వారి ప్రేమకు, పెళ్లికి అడ్డుకాలేదు. అందుకే ఎవరి మతాన్ని తక్కవ చేయకుండా వీరిద్దరు హిందూ పద్ధతిలోనే కాకుండా క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయాలతో, 7న క్రిస్టియన్ సాంప్రదాయాలతో వీరి పెళ్లి జరిగింది. గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్.. చూసిన ప్రతీ ఒక్కరికీ డ్రీమ్ వెడ్డింగ్‌లాగా నిలిచిపోయింది.

చైసామ్‌ల పెళ్లి ఫోటోలు ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. అందుకే వారి విడాకుల విషయం ఇంకా చాలామందికి నమ్మశక్యంగా లేదు. చైసామ్‌ల పెళ్లిలో సమంత కట్టుకున్న చీర గురించి అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. ఆ చీర చైతన్య అమ్మమ్మ, రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. చాలాకాలం కిందటి చీర కావడంతో దానిని రీ మోడలింగ్‌ చేయడానికి రూ. 40 లక్షలు ఖర్చు అయ్యాయన్న వార్త అప్పట్లో వైరల్‌గా మారింది. ఆ చీరలో సమంత ఫోటోలు ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయి..

Tags

Read MoreRead Less
Next Story