సినిమా

Samantha: సమంత సూపర్.. ఒక్క సిరీస్‌తో డబుల్ బొనాంజ..

Samantha: సమంత.. కెరీర్ ప్రారంభమయినప్పటి నుండి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న నటి.

Samantha (tv5news.in)
X

Samantha (tv5news.in)

Samantha: సమంత.. కెరీర్ ప్రారంభమయినప్పటి నుండి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న నటి. సినిమా సినిమాకు తన నటనలోని ఇంప్రూవ్‌మెంట్ చూసి తనకు స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందించారు ప్రేక్షకులు. కేవలం కమర్షియల్ సినిమాల్లోనే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా తన నటనతో ఆకట్టుకున్న సామ్‌కు మరో గౌరవం అవార్డు రూపంలో దక్కింది.

వెండితెరపై రాణిస్తుండగా ఓటీటీలో ఎంట్రీ ఏంటి అని చాలామంది విమర్శించినా పట్టించుకోకుండా సమంత.. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ను సైన్ చేసింది. అప్పటివరకు వెబ్ సిరీస్‌లంటే ఫారిన్ లాంగ్వేజ్‌లోనే బాగుంటాయి అనుకున్న ప్రేక్షకులకు ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను ఫ్యామిలీ మ్యాన్ రూపంలో రుచి చూపించారు దర్శకులు రాజ్, డీకే. అంతే.. ఇది సిరీస్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది.

ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్‌కంటే రెండో సీజన్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతే కాకుండా ఈ సక్సెస్‌లో చాలావరకు క్రెడిట్ సమంతకే దక్కడం విశేషం. రాజీ పాత్రలో డీ గ్లామర్‌గా కనిపించడమే కాకుండా విలనిజంతో అందరినీ ఆకట్టుకుంది. కొన్ని సీన్స్‌లో బోల్డ్‌గా కూడా నటించి ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచింది. దీంతో సామ్ క్రేజ్ సౌత్‌లోనే కాదు నార్త్‌లో కూడా విపరీతంగా పెరిగిపోయింది.

ఫ్యామిలీ మ్యాన్ దెబ్బతో సామ్‌కు బాలీవుడ్ నుండి ఆఫర్లు వరుసగా క్యూ కట్టాయి. తాజాగా ఫ్యామిలీ మ్యాన్ 2లో తన నటనకు సమంత బెస్ట్ ఫీమేల్ లీడ్‌గా ఓటీటీ అండ్‌ డిజిటల్ మార్కెట్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2021ను అందుకుంది. అంతే కాదు ఫిల్మ్ ఛాంపియన్ డిస్రప్టర్స్- 2021లో టాప్‌-20లో సమంత స్థానం సంపాదించుకుంది. దీంతో సమంతకు డబుల్ హ్యాపీనెస్ దక్కినట్టే.

Next Story

RELATED STORIES