Samyuktha Menon : 'ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం'..సంయుక్త వాటే స్పీచ్...!

Samyuktha Menon : ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం..సంయుక్త వాటే స్పీచ్...!
Samyuktha Menon : ఈ ఈవెంట్‌‌లో హీరోయిన్ సంయుక్త మీనన్ స్పీచ్ మెయిన్ హైలెట్‌‌గా నిలిచింది. యాంకర్ సుమ నుంచి మైక్ అందుకున్న సంయుక్త ఇంగ్లీష్‌‌లో స్పీచ్ ఆదరగోడుతుంది

Samyuktha Menon : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ భీమ్లానాయక్.. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రేపు(ఫిబ్రవరి 25)న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్‌‌లో భాగంగా చిత్రయూనిట్ నిన్న హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ని గ్రాండ్‌‌గా నిర్వహించింది. ఈ ఈవెంట్‌‌కి తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిధిగా వచ్చారు.


ఈ ఈవెంట్‌‌లో హీరోయిన్ సంయుక్త మీనన్ స్పీచ్ మెయిన్ హైలెట్‌‌గా నిలిచింది. యాంకర్ సుమ నుంచి మైక్ అందుకున్న సంయుక్త ఇంగ్లీష్‌‌లో స్పీచ్ ఆదరగోడుతుంది అనుకున్నారంతా.. కానీ తెలుగులో మాట్లాడుతూ అందర్నీ షాక్‌‌కి గురిచేసింది. పవన్ - రానాలతో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పింది. తెలుగులో ఇంతమంచి డెబ్యూ దొరకడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించింది. ఇదో పునర్జన్మగా భావిస్తున్నట్టుగా వెల్లడించింది. పెద్దగా కలలు కనండి.. ఆ కలలను ఆపకండి.. ధైర్యంగా వాటిని ఛేజ్ చేయండి అంటూ పవన్ డైలాగ్‌‌ని చెప్పి ఆకట్టుకుంది.


ఇక చివర్లో పవన్ కళ్యాణ్ స్పీచ్ లలో ఎక్కువగా వినిపించే "ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు.. చేతిలో దీపం లేదు.. కానీ నా ధైర్యమే కవచం.. నా ధైర్యమే ఆయుధం.." అనే డైలాగ్ చెప్పి భీమ్లానాయక్ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నానని స్పీచ్ ముగించింది. సంయుక్త స్పీచ్ విన్న సుమ "అమ్మా యాంకరింగ్ లోకి మాత్రం రాకమ్మా .. తొక్కేసేలా ఉన్నావు" అని అనడం కొసమెరుపు. కాగా ఈ సినిమాలో తన పాత్రకి తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది సంయుక్త మీనన్.

ఇక ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా, దీనికి థమన్ ఎస్ సంగీతం అందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story