సినిమా

Sanam Shetty: బిగ్ బాస్ వల్ల ఏ ఉపయోగం లేదంటున్న నటి..

Sanam Shetty: బిగ్ బాస్ హౌస్ అంటే సామాన్య వ్యక్తులను, అప్‌కమింగ్ యాక్టర్స్‌ను కూడా లైమ్‌లైట్‌లోకి తీసుకువస్తుంది.

Sanam Shetty (tv5news.in)
X

Sanam Shetty (tv5news.in)

Sanam Shetty: బిగ్ బాస్ హౌస్ అంటే సామాన్య వ్యక్తులను, అప్‌కమింగ్ యాక్టర్స్‌ను కూడా లైమ్‌లైట్‌లోకి తీసుకువస్తుంది. సినిమా ఆఫర్లను తీసుకొస్తుంది. ఎంతోమందికి ఈ షోనే లైఫ్ ఇస్తుంది. కానీ ఆ షో వల్ల వచ్చే ఫేమ్ కొన్నిరోజులే అన్న టాక్ కూడా ఉంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత, మరొక సీజన్ మొదలయిన తర్వాత ముందు కంటెస్టెంట్స్‌కు వచ్చిన ఫేమ్ ఫేడవుట్ అయిపోతుంది. అదే విషయాన్ని స్పష్టం చేసింది సనమ్‌ శెట్టి.

బిగ్ బాస్ తెలుగు, తమిళ సీజన్లు ఒకేసారి మొదలయ్యాయి. ఇప్పటికీ ఈ రెండు బిగ్ బాస్ షోల వల్ల ఎంతోమందికి ఫేమ్ వచ్చింది. ఎంతోమంది అప్‌కమింగ్ ఆర్టిస్టులు హీరోలుగా, హీరోయిన్లుగా అవకాశాలు అందుకున్నారు. కెరీర్ డల్ అయిపోయిన వారు మళ్లీ ఫార్మ్‌లోకి వచ్చారు. కానీ అవన్నీ తనకు జరగలేదు అంటోంది నటి సనమ్ శెట్టి.

తమిళంలో 25కు పైగా సినిమాల్లో నటించింది సనమ్ శెట్టి. అందులో కొన్ని హీరోయిన్‌గా, కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది. అలా తనకు బిగ్ బాస్ 4 తమిళంలో చోటు దక్కింది. కానీ దాని వల్ల తనకు ఏ ఉపయోగం లేదంటోంది సనమ్ శెట్టి. బిగ్ బాస్ తర్వాత తనకు వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా, ఏ విధంగా కూడా ప్రయోజనం లేదని స్పష్టం చేసింది సనమ్. ప్రస్తుతం బిగ్ బాస్‌పై తాను చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story

RELATED STORIES