హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో 'సందేహం'.. ఫస్ట్ లుక్ రిలీజ్

హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో సందేహం.. ఫస్ట్ లుక్ రిలీజ్
'సందేహం' అనే టైటిల్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి 'షి బిలీవ్డ్' అనే ట్యాగ్ లైన్ జోడించారు.

హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో 'సందేహం' సినిమా తెరకెక్కుతోంది. ఇందుకుగాను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యునిట్. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుమన్ పూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకున్న 'సందేహం'... పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హెబ్బా పటేల్ సీరియస్ లుక్ లో కనిపిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో నాచురల్ లొకేషన్స్, ఇతర ముఖ్య లీడ్ రోల్స్ ని చూపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచారు. 'సందేహం' అనే టైటిల్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి 'షి బిలీవ్డ్' అనే ట్యాగ్ లైన్ జోడించారు. మొత్తానికి ఫస్ట్ లుక్ తోనే ఈ సందేహంపై జనం కన్ను పడిందని చెప్పుకోవచ్చు.

విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో ఎప్పుడూ చూడని డిఫరెంట్ పాత్రలో హెబ్బా పటేల్ ఒదిగిపోయిందని అన్నారు. ఈ రోల్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుందని సినీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ సినిమాలో శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ, సురేష్ దుర్గం ఎడిటర్ గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.




Tags

Read MoreRead Less
Next Story