Double Ismart: గట్టిగానే ఛార్జ్ చేస్తోన్న దాదా...

Double Ismart: గట్టిగానే ఛార్జ్ చేస్తోన్న దాదా...
'డబుల్ ఇస్మార్ట్' కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన బాలీవుడ్ హీరో

ప్రస్తుతం సౌత్ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న బాలీవుడ్ నటుల జాబితాలో సంజయ్ దత్ కూడా చేరిపోయాడు. దీంతో సంజయ్ దత్ నటనా జీవితం ఉత్తేజకరమైన మలుపు తిరిగింది. ఆయన ఈ దశను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. బాలీవుడ్ ప్రాజెక్ట్‌లు అతని చేతిలో ఉండగా, ఇటీవలే దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. శాండల్‌వుడ్‌లోనూ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు 'లియో' చిత్రంలో తలపతి విజయ్‌తో కలిసి కోలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో విడుదలైన 'ఆంటోనీ దాస్' క్యారెక్టర్ కు సైతం విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో సంజయ్ దత్, తలపతి విజయ్ ను సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంజయ్ దత్ చేతిలో పలు ప్రాజెక్ట్‌లు ఉండగా.. హీరో రామ్ పోతినేని రాబోయే చిత్రం 'డబుల్ ఇస్మార్ట్‌'లోనూ నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దత్ మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నారు. 'డబుల్ ఇస్మార్ట్' చిత్రంతో టాలీవుడ్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ సినిమాలో నటించినందుకు గానీ భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ముంబై షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'డబుల్ ఇస్మార్ట్‌' లో తన పాత్ర కోసం సంజయ్ ఏకంగా రూ. 15 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

'డబుల్ ఇస్మార్ట్' లో సంజయ్ దత్ ఎంట్రీతో మూవీపై ఇప్పటికే ఉన్నఅంచనాలు ఇప్పుడు రెట్టింపయ్యాయి. అయితే ఈ సినిమా షూట్ సంజయ్ దత్ 60 రోజులు కేటాయించాడని, టాలీవుడ్ ప్రొడక్షన్‌లో నటించిన అత్యంత ఖరీదైన బాలీవుడ్ నటుల్లో ఒకరిగా దత్ నిలిచాడని వార్తలు వస్తున్నాయి.

'KGF చాప్టర్ 2' బ్లాక్ బస్టర్ విజయంతో దత్ కెరీర్ మళ్లీ పునరుజ్జీవం పొందిందని చెప్పవచ్చు. ఆ సినిమాలో దత్ విలన్ పాత్ర పోషించినందుకు గానూ ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. సామ్రాట్ పృథ్వీరాజ్ షంషేరాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, దత్ పర్ఫార్మెన్స్ విమర్శకులను సైతం ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఆయన సినిమాల విషయానికొస్తే.. దత్.. షారుఖ్ ఖాన్ 'జవాన్‌'లో అతిథి పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీకి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు 'హేరా ఫేరి 3', 'వెల్‌కమ్ 3'లోనూ పలు పాత్రలతో కనువిందు చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story