Double Ismart: సంజయ్ దత్ బిగ్ బుల్‌ క్యారెక్టర్ రివీల్

Double Ismart: సంజయ్ దత్ బిగ్ బుల్‌ క్యారెక్టర్ రివీల్
రామ్, పూరీల ‘డబుల్ ఇస్మార్ట్‌’ లో ఫుల్ లెంగ్త్ రోల్ చేయనున్న సంజయ్ దత్

ఉస్తాద్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్‌’పై క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలోని బిగ్ బుల్‌ని పరిచయం చేస్తూ, రామ్, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్‌గా ప్రకటించింది. తెలుగులో గతంలో 1998లో నాగార్జున హీరోగా వచ్చిన చంద్రలేఖలో నటించిన ఆయన.. మళ్లీ ఇన్నేళ్లకు ఓ తెలుగులో కనిపిస్తుండడం విశేషం. ఆయన గతేడాది 'కేజీఎఫ్ 2'లో అథితి పాత్రలో నటించి తన సత్తా చూపెట్టారు. ఆ తర్వాత విజయ్ ‘బీస్ట్’ మూవీలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్‌లో సంజయ్ అలరించనున్నారు.

కాగా 'డబుల్ ఇస్మార్ట్' లో రామ్ సరసన నటించే హీరోయిన్‌తో పాటు సంగీత దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. ఈ సినిమా ఒక ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాన్ని రూపొందించడంతో చిత్రీకరణ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్ స్టైలిష్ మేకోవర్‌లో కనిపించనున్నాడని సమాచారం.

ఇక ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ రోల్ విషయానికొస్తే.. డబుల్‌ ఇస్మార్ట్‌లో ఆయన ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఆయన మొదటి షెడ్యూల్‌ షూట్‌లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు, సంజయ్ దత్ పాత్రను బిగ్ బుల్‌గా పరిచయం చేస్తూ.. మేకర్స్ అతని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో సంజయ్.. ఫంకీ హెయిర్‌, గడ్డం, చెవిపోగులు, ఉంగరాలు, ఖరీదైన గడియారం ధరించి కనిపిస్తున్నారు. అతని ముఖం, వేళ్లపై పచ్చబొట్టుతో అల్ట్రా స్టైలిష్‌గా, కాస్త భయంకరంగా కనిపిస్తున్నాడు, ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సంజయ్ దత్ సిగార్ తాగుతున్నట్లు కనిపిస్తుండగా.. తుపాకీలన్నీ అతని వైపు చూపిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో చూడవచ్చు. మొత్తానికి సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. తన నటీనటులను సాధ్యమైనంత ఉత్తమంగా మాస్ అప్పీలింగ్‌గా ఎలా ప్రదర్శించాలో తెలిసిన పూరీ.. 'డబుల్ ఇస్మార్ట్‌'లో సంజయ్ దత్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించనున్నారు.

రామ్, సంజయ్ దత్‌లను ఒకే స్ర్కీన్ పై కలిపి చూడటం అభిమానులకు, సినీ ప్రియులకు ఉత్సాహంగా ఉండనుంది. ఈ వైల్డ్ కాంబినేషన్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సందర్భంగా స్పందించిన సంజయ్ దత్.. “మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ జీ, యువ ఎనర్జిటిక్ ఉస్తాద్ రామ్ తో ఈ సినిమాలో బిగ్ బుల్ క్యారెక్టర్ ప్లే చేయడం ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఫై మాస్ ఎంటర్‌టైనర్ లో ఈ సూపర్-టాలెంటెడ్ టీమ్‌తో జతకట్టడానికి సంతోషిస్తున్నాను. ఈ చిత్రం 2024 మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తన ఆనందాన్ని, అభిప్రాయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో అధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు మేకర్స్. డబుల్ ఇస్మార్ట్ మార్చి 8, 2024న మహా శివరాత్రికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story