సినిమా

Sankranti Movies 2022: అనుపమ వర్సెస్ నిధి.. ఈసారి సంక్రాంతి భామ ఎవరు..?

Sankranti Movies 2022: ముఖ్యంగా రౌడీ బాయ్స్ చిత్రంలో అనుపమ లిప్ లాక్స్.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Sankranti Movies 2022: అనుపమ వర్సెస్ నిధి.. ఈసారి సంక్రాంతి భామ ఎవరు..?
X

Sankranti Movies 2022: సంక్రాంతి అంటే సినిమా పండుగ. ముఖ్యంగా టాలీవుడ్‌లో సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ఎదరుచూసే దర్శక నిర్మాతలు ఎందరో.. కానీ ఈసారి అలా జరగలేదు. మొదట సంక్రాంతి బాక్సాఫీస్ రేసు ఫుల్ హైప్‌తో మొదలయినా కూడా రేస్ నుండి ఒక్కొక్క సినిమా తప్పుకోవడంతో సంక్రాంతి పోటీ అంతా చాలా సాదాసీదాగా మారిపోయింది. అయితే ఎక్కువగా సంక్రాంతికి హీరోల పోటీని చూసే ప్రేక్షకులు.. ఈసారి హీరోయిన్ల పోటీని చూశారు.

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయిన ఒకేఒక్క పెద్ద సినిమా 'బంగార్రాజు'. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ చిత్రాలకు పోటీగా తమ విడుదల తేదీని ప్రకటించింది బంగార్రాజు టీమ్. మెల్లగా ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ పోటీ నుండి తప్పుకున్నాయి. దీంతో బంగార్రాజుకు కాస్త పోటీ కూడా లేకుండా పోయింది. అందుకే పాజిటివ్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్‌తో ముందుకెళ్తోంది బంగార్రాజు. ఇక ఈ సినిమాకు పోటీగా మరో రెండు చిన్న సినిమాలు థియేటర్లలో సందడికి దిగాయి.

బంగార్రాజుకు థియేటర్లలో పోటీ ఇవ్వడానికి దిగిన సినిమాలు.. రౌడీ బాయ్స్, హీరో. ఈ రెండు సినిమాలలో నటించిన హీరోలు కొత్తవారే. డైరెక్టర్లు కూడా అప్‌కమింగే. అయినా ఈ రెండు చిత్రాల్లో ఓ కామన్ పాయింట్ ఉంది. అదే యూత్‌కు నచ్చే హీరోయిన్స్ ఉండడం. రౌడీ బాయ్స్ హీరో ఆశిష్, హీరోతో ఎంట్రీ ఇస్తున్న అశోక్ గల్లా ఎవరో ప్రేక్షకులకు తెలీదు. కానీ ఈ సినిమాల్లో హీరోయిన్స్ వల్లే వీటీకి ఎంతోకొంత హైప్ వచ్చింది.


ముఖ్యంగా రౌడీ బాయ్స్ చిత్రంలో అనుపమ లిప్ లాక్స్.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎక్కువగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అందుకే ఈసారి సంక్రాంతి సినిమా పోటీ అనుపమ వర్సెస్ నిధిగా మారింది. ఇప్పటివరకు రౌడీ బాయ్స్, హీరో.. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ టాకే వచ్చింది. పైగా ఈ ఇద్దరు భామలు కూడా తమ యాక్టింగ్‌తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసి ఇద్దరూ విన్నర్స్‌గానే నిలిచారు.Next Story

RELATED STORIES