సినిమా

సిగ్గుపడుతూ విజయ్ దేవరకొండ పై బోల్డ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ లో ఒక్క సినిమా చేయలేదు కానీ అక్కడ మాత్రం వీపరితమైన క్రేజ్ సంపాదించుకుంటున్నాడు రౌడీబాయ్ విజయ్ దేవరకొండ..

సిగ్గుపడుతూ విజయ్ దేవరకొండ పై బోల్డ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ
X

బాలీవుడ్ లో ఒక్క సినిమా చేయలేదు కానీ అక్కడ మాత్రం వీపరితమైన క్రేజ్ సంపాదించుకుంటున్నాడు రౌడీబాయ్ విజయ్ దేవరకొండ.. అక్కడి టాప్ హీరోయిన్లు అతడితో కలిసి సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పుడా లిస్టులోకి చేరిపోయింది బాలీవుడ్ బ్యూటీ సారా ఆలీఖాన్.. అక్షయ్ కుమార్, ధనుష్ హీరోలుగా నటించిన 'అత్రాంగి రే' చిత్రంలో హీరోయిన్ గా నటిచింది సారా.

త్వరలో ఈ సినిమా రిలీజ్ కి దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ పైన సిగ్గుపడుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండ తమ ఫేవరేట్ స్టార్ అని చెప్పుకొచ్చింది. విజయ్ చాలా హాట్ అని, కూల్ గా ఉంటాడని , అతనితో కలిసి నటించాలని ఉందని పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సారా గతంలో విజయ్‌తో ఒక సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దానికి 'ఫ్యాన్ మూమెంట్' అని క్యాప్షన్ ఇచ్చింది. ఆ క్రమంలో ఇద్దరు డేటింగ్ చేస్తునట్టుగా వార్తలు కూడా వచ్చాయి. ఇక మరోవైపు విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Next Story

RELATED STORIES