సినిమా

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' నుండి మొదటి సాంగ్ వచ్చేది అప్పుడే..

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబును తన ఫ్యాన్స్ గతేడాది స్క్రీన్ పైన మిస్ అయ్యారు.

Sarkaru Vaari Paata (tv5news.in)
X

Sarkaru Vaari Paata (tv5news.in)

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబును తన ఫ్యాన్స్ గతేడాది స్క్రీన్ పైన మిస్ అయ్యారు. 2020లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సరిలేరు నీకెవ్వరూ'.. మహేశ్ నటించిన చివరి చిత్రం. దాని తర్వాత పెద్దగా టైమ్ తీసుకోకుండా వెంటనే దర్శకుడు పరశురామ్‌తో కలిసి సర్కారు వారి పాటను మొదలుపెట్టాడు మహేశ్. కానీ ఆ సినిమా మొదలయినప్పటి నుండి ఎక్కువగా వాయిదాలు పడతుండడంతో ఇంకా షూటింగ్ పూర్తికాలేదు.

గీతా గోవిందం లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన పరశురామ్.. మహేశ్‌తో సినిమా చేస్తున్నాడు అనగానే చాలామంది దానిపై అప్పుడే అంచనాలు పెంచేసుకున్నారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ పెద్దగా బయటికి రాకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ అసహనంతో ఉన్నారు. ఇప్పటివరకు సర్కారు వారి పాట నుండి ఓ టీజర్ తప్ప మరే అప్డేట్ లేదు. కనీసం ఒక్క పాట కూడా విడుదల కావడం లేదు అనుకుంటున్న ఫ్యాన్స్‌కు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది.

మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు తమన్. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకుంటున్న తమన్ చేతిలో ప్రస్తుతం అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటితో పాటు సర్కారు వారి పాటకు కూడా తానే సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే సర్కారు వారి పాట మొదటి పాట గురించి తమన్ ఇచ్చిన అప్డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

సర్కారు వారి పాట సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్.. సంక్రాంతి నుండి అప్డేట్స్ షురూ అని ఇటీవల ట్వీట్ చేసింది. అసలైతే ఈ సంక్రాంతికి సినిమానే విడుదల కావాల్సి ఉన్నా.. మిగతా పాన్ ఇండియా సినిమాలన్నీ సంక్రాంతి రేసులో నిలబడడంతో సర్కారు వారి పాట పక్కకు తప్పుకుంది. అందుకే మహేశ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా సంక్రాంతి నుండి సర్కారు వారి పాట అప్డేట్స్ సందడి షురూ కానుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది.


Next Story

RELATED STORIES