Sarkaru Vaari Paata : 'కళావతి'తో ప్రేమలో పడండి.. సర్కారు వారి పాట బిగ్ సర్‌‌ప్రైజ్...!

Sarkaru Vaari Paata : కళావతితో ప్రేమలో పడండి.. సర్కారు వారి పాట బిగ్ సర్‌‌ప్రైజ్...!
Sarkaru Vaari Paata : తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ మెయిన్ లీడ్‌‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట..

Sarkaru Vaari Paata : తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ మెయిన్ లీడ్‌‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. 'కళావతి' అంటూ పాగే ఈ పాటను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. "వాలెంటైన్స్ డే రోజున 'కళావతి'తో ప్రేమలో పడండి" సోషల్ మీడియాలో వెల్లడించారు మేకర్స్... థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ ఈ సినిమాని మే 12న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు... త్రివిక్రమ్, రాజమౌళితో సినిమా చేయనున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story