పెద్దోడు, చిన్నోడు వచ్చి తొమ్మిదేళ్ళు.. సీత పాత్రను వదులుకున్న ఐదుగురు స్టార్ హీరోయిన్లు..!

పెద్దోడు, చిన్నోడు వచ్చి తొమ్మిదేళ్ళు.. సీత పాత్రను వదులుకున్న ఐదుగురు స్టార్ హీరోయిన్లు..!
Seethamma Vakitlo Sirimalle Chettu : టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"..

Seethamma Vakitlo Sirimalle Chettu : టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు".. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్‌‌టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమా 2013 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. సరిగ్గా ఈ సినిమా రిలీజై నేటికి తొమ్మిదేళ్ళు పూర్తి అయింది. ఈ సందర్భంగా సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

పెద్దోడు, చిన్నోడుగా నటించి రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ మల్టీస్టారర్ మూవీ‌‌స్‌‌కి గ్రాండ్ వెల్‌‌కమ్ చెప్పారు వెంకీ, మహేష్.

♦ ముందుగా ఈ సినిమాని మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నారు శ్రీకాంత్ అడ్డాల.. కానీ పవన్ ప్లేస్ లోకి వెంకటేష్ వచ్చారు. ఈ సినిమాకి సింగిల్ సిట్టింగ్ లోనే వెంకీ, మహేష్ లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.

♦ గీత పాత్రకి సమంతని తీసుకున్నారు. అంతకుముందు సింగర్ చిన్మయి.. సామ్ కి డబ్బింగ్ చెప్పేది.. కానీ ఈ సినిమా నుంచి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది సామ్.

♦ సీత పాత్రకి పెద్ద కథే నడిచింది. ముందుగా త్రిష, స్నేహా, భూమిక, అనుష్కలను అనుకున్నారు. చివరకి అమలపాల్ ని తీసుకున్నారు. ఆమె కూడా సినిమా చేయడానికి సైన్ చేసింది. ఆ తర్వాత ఏమైందో కానీ ఆమె స్థానంలో అంజలిని తీసుకున్నారు. సీత పాత్రలో అంజలిని తప్ప మరొకరిని ఊహించుకోలేము కూడా... అంతగా సూట్ అయింది అంజలి.

♦ రేలంగి మావయ్య పాత్రకి ముందుగా స్టార్ హీరో రాజశేఖర్ ని అనుకున్నారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ని ఫైనల్ చేశారు.

♦ అంతకుముందు ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ అభినయకి ఈ సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది.

♦ ఈ సినిమాలోని పాటలను అనంత్ శ్రీరామ్, సిరివెన్నెల రాయగా, మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. మణిశర్మ నేపధ్యం సంగీతం అందించారు.

♦ 20113సంవత్సరానికి గాను ఈ చిత్రానికి ఉత్తమకుటుంబ చిత్రంగా నంది అవార్డు లభించింది.

♦ అంతేకాకుండా ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకి, ఉత్తమ సహాయ నటుడుగా ప్రకాష్ రాజ్ కి, ప్రత్యేక జ్యూరీ అవార్డుగా అంజలి నంది అవార్డులు అందుకున్నారు.

♦ మాటల రచయిత గణేష్ పాత్రోకి ఇది చివరి చిత్రం.

♦ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 54.75 కోట్ల కలెక్షన్లను సాధించింది.

Tags

Read MoreRead Less
Next Story